Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఆలేరుటౌన్
ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్రంలో జరుగు తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వివిధ పార్టీలకు చెందిన యువకులు టీఆర్ఎస్లో చేరుతున్నారని టెస్కాబ్ రాష్ట్ర వైస్‌చైర్మెన్,ఉమ్మడి నల్లగొండ జిల్లా డీసీసీబీ చైర్మెన్ గొంగిడి మహేందర్‌రెడ్డి అన్నారు. ఆలేరు పురపాలక సంఘం నుండి బీజేపీ, కాంగ్రెస్‌ల నుండి మోతె సారయ్య, మోతె లాలు, తూర్పటి నర్సింహ, మోతె మల్లయ్య, మోతె వెంకటయ్య, దొంతుల ప్రశాంత్, సంగి మైసయ్య, బర్మ రాజు,తూర్పటి రామస్వామి,మోతే దావీద్,పడతం మదార్,తూర్పటి, సాంబయ్య, మోతె సాంబయ్య,పడతం యాదగిరి, ప్రేమ్ కుమార్, తూర్పటి మల్లయ్య, మోతే సారయ్య, మైసయ్య, పేరపు మల్లయ్య,గజరాజు ఉపేందర్, భారీ ఎత్తున మహిళలు 200 మంది టీఆర్ఎస్లో చేరారు.వారికి గొంగిడి కండువాలు కప్పి ఆహ్వానించారు.ఈ కార్యక్రమంలో పురపాలకసంఘం చైర్మెన్ శంకరయ్య,పట్టణ అధ్యక్షులు పుట్ట మల్లేష్‌గౌడ్, మాజీ పట్టణ అధ్యక్షులు మొరిగాడి వెంకటేష్, గ్రంథాలయ డైరెక్టర్ బాలస్వామి, కౌన్సిలర్ రాయపురం నర్సిములు,కుండే సంపత్, కుళ్ళ సిద్దులు,పత్తి వెంకటేష్, కుళ్ళ వెంకటేష్, వస్పరి బాలయ్య, రాయపురం శేఖర్ , పడతం జాషువ, ఫయాజ్, షాబోద్దీన్,దొంతుల ఎల్లేష్,పల్లె మహేష్, దొంతులరాములు, గజరాజునాగరాజు ,రాయపురంసుధాకర్ తదితరులు పాల్గొన్నారు.
బొమ్మలరామారం: యాదగిరిగుట్ట మండల కేంద్రంలోని గొంగిడి నిలయంలో బొమ్మలరామారం మండలం హాజీపురం గ్రామం నుంచి 250 మంది కాంగ్రెస్ కార్యకర్తలు, యువకులు ఉమ్మడి నల్లగొండ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ చైర్మెన్, తెలంగాణ రాష్ట్ర సహకార అపెక్స్ బ్యాంక్ వైస్‌చైర్మెన్ గొంగిడి మహేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో టీిఆర్‌ఎస్ కండువా కప్పుకొని పార్టీలో చేరారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్రంలో చేస్తున్న అభివద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలకు ఆకర్షితులైన యువకులు, వివిధ పార్టీల కార్యకర్తలు ఆకర్షితులై పార్టీలో చేరుతున్నారన్నారు.ఈ కార్యక్రమంలో ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మెన్ గడ్డమీద రవీందర్‌గౌడ్,పార్టీ బొమ్మలరామారం మండలఅధ్యక్షులు వెంకటేష్, పీఏసీఎస్ చైర్మెన్ బాలనర్సయ్య, భువనగిరి మార్కెట్ కమిటీ వైస్‌చైర్మెన్ కూసంగుల సత్యనారాయణ, మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ రామిరెడ్డి,టీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు రామస్వామిగౌడ్,మండల యూత్ అధ్యక్షులు బీరప్ప,టీఆర్ఎస్వీ మండలనాయకులు సతీష్‌గౌడ్, ఎస్సీ సెల్ మండలఅధ్యక్షులు మైలారం రామకృష్ణ,మండల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.