Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో ఆస్పత్రి పరిశీలన, సర్వే
నవతెలంగాణ-రామన్నపేట
రామన్నపేట ప్రభుత్వాస్పత్రి సమస్యలకు నిలయంగా మారిందని, ప్రజారోగ్యం పట్ల చిన్నచూపు తగదని సీపీఐ(ఎం) జిల్లా కమిటి సభ్యుడు జల్లెల పెంటయ్య, మండల కార్యదర్శి బొడ్డుపల్లి వెంకటేశం అన్నారు.ఆ పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం పరీశీలన చేసి సర్వే నిర్వహించి రోగులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్బంగా మాట్లాడుతూ చుట్టూరా 6మండలాల ప్రజలకు కేంద్రమైన రామన్నపేట ప్రభుత్వాస్పత్రిని ప్రభుత్వ నిర్లక్ష్యంతో, డాక్టర్ల అలసత్వంతో సమస్యలకు నిలయంగా మారిందన్నారు. 50పడకలని పేరుకే పరిమితం తప్ప ఎలాంటి సౌకర్యాలు లేవన్నారు.రోజుకు 400 మంది రోగులు వస్తుంటే కనీసం బెడ్లు సరిపోక వరండాల్లోనే సేలైన్లు ఎక్కించుకుంటున్న పరిస్థితి నెలకొన్నదన్నారు.గర్భిణుల డాక్టర్ రెగ్యులర్గా అందుబాటులో ఉండకపోవడంతో గర్భిణులు, ఇతర ప్రాంతాలకు, ప్రయివేటు ఆస్పత్రులకు వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు. రోగులపట్ల ప్రభుత్వం, సిబ్బంది, వైద్యులు అలసత్వంగా వ్యవహరిస్తున్నారన్నారు. ప్రజలకు సేవలందించాల్సిన ఆస్పత్రి సమస్యలకు నెలవుగా మారిందన్నారు. దశాబ్దాల తరబడి అనేక సమస్యలు దర్శనమిస్తున్నా పాలకులకు చలనం లేకుండా పోయిందన్నారు. సీజనల్వ్యాధులు రావడంతో కనీస టెస్టులు లేక ప్రయివేటు ఆస్పత్రులకు టెస్టుల కోసం వెళ్తూ వేలకు వేలు వెచ్చించాల్సి వస్తుందన్నారు.వంద పడకల ఆసుపత్రిగా మార్చి అదనపు పోస్టులను కేటాయించి,ఖాళీపోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.ఆస్పత్రిలో నెలకొన్న సమస్యలపై పార్టీ ఆధ్వర్యంలో దశలవారీగా ఆందోళనా కార్యక్రమాలకు పిలుపునిస్తామన్నారు.ఈ కార్యక్రమంలో పార్టీ కార్యదర్శివర్గ సభ్యులు గాదెనరేందర్, నాయకులు గొరిగెసోములు, గునగంటి మల్లేషం,అంతటిసత్తయ్య, పోలగోనిస్వామి తదితరులు పాల్గొన్నారు.