Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-తుర్కపల్లి
ఈనెల 20న యాదగిరిగుట్టలో జరిగే రోడ్ ట్రాన్స్పోర్ట్ డ్రైవర్స్,వర్కర్స్ యూనియన్ యాదాద్రి భువనగిరి జిల్లా 2వ మహాసభల సందర్భంగా జరిగే బహిరంగసభలో అధికసంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని ఆలిండియా రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ (AIRTWF-CITU) కేంద్ర కమిటి సభ్యులు,జిల్లా ప్రధాన కార్యదర్శి కల్లూరి మల్లేశం ట్రాన్స్పోర్ట్ కార్మికులకు పిలుపునిచ్చారు. ఆదివారం మండలకేంద్రంలో మహాసభల కరపత్రాలను కార్మికులతో కలిసి ఆయన విడుదల చేసి మాట్లాడారు.ట్రాన్స్పోర్ట్ కార్మికులు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ప్రజలను, వస్తుసామగ్రిని వారివారి గమ్యస్థానాలకు చేర్చుతూ ప్రజాసేవలో ముందున్నా రన్నారు. ప్రతిఏడాది వేలాదిమంది చనిపోతున్నా ప్రభుత్వాలు సహకారం చేయడం లేదని విమర్శి ంచారు. అందుకోసం సంక్షేమబోర్డు ఏర్పాటు చేసి కార్మికులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.కేంద్రం తెచ్చిన నూతన మోటారు వాహనసవరణ చట్టం-2019ను రద్దు చేయాలని కోరారు.యాదగిరిగుట్ట పైకి అటోలకు అనుమతిం చాలని,ప్రతి మండలకేంద్రంలో అటో అడ్డాలకు స్థలాలు కేటాయించాలని, ఇతర సమస్యల పరిష్కారం కోరుతూ మహాసభల సందర్భంగా భారీ బహిరంగసభ నిర్వహిస్తున్నా మన్నారు.బహిరంగసభకు ముఖ్య అతిథిగా సీఐటీయూ రాష్ట్ర ప్రధానకార్యదర్శి పాలడుగు భాస్కర్,A×=ుఔఖీ రాష్ట్ర కార్యదర్శి పుప్పాల శ్రీకాంత్ పాల్గొంటు న్నారన్నారు.ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా నాయకులు పోతరాజు జహంగీర్, సీఐటీయూ మండల కన్వీనర్ తూటి, మండల నాయకులు గడ్డమీది నర్సింహ, వెంకటేశం, ట్రాన్స్పోర్ట్ రంగం మండల అధ్యక్షుడు గుండెబోయిన బలరాం, ఉపాధ్యక్షులు కట్కూరి వెంకటేశం, నాయకులు పోచయ్య, శ్రీను, వెంకన్న, సోమల మల్లేశం, శివకష్ణ పాల్గొన్నారు.