Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎండీ జహంగీర్
నవతెలంగాణ-ఆలేరుటౌన్
తెలంగాణ సాయుధ పోరాటం భవిష్యత్లో సీపీఐ(ఎం) వామపక్ష పార్టీలు చేసే ప్రజాఉద్యమాల కు దిక్సూచి అని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి ఎండీ జహంగీర్ అన్నారు.మండలకేంద్రంలో శనివారం రాత్రి తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాల్లో భాగంగా పార్టీ సీనియర్ నాయకులు,మాజీ సింగిల్విండో చైర్మెన్ మొరిగాడు చంద్రశేఖర్ జెండాను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తెలంగాణ సాయుధ పోరాటం పేరు చెప్పుకొని ఓట్ల బిచ్చమెత్తుకుంటున్న పార్టీలు ప్రస్తుతం ఉన్నాయని ఎద్దేవా చేశారు.వందల ఏండ్లుగా బానిసత్వంలో వెట్టిచాకిరి, దోపిడీ వ్యవస్థ పెట్రేగి పోయిందన్నారు.తెలంగాణ సమాజాన్ని మేలుకొల్పి సాయుధ పోరాటం నడిపించి నిజాంమూకలను మట్టి మనుషులతో కలిసి మట్టి కరిపించిన మహోజ్వల పోరాటంగా ఆయన అభివర్ణించారు.సాయుధ పోరాటం ద్వారా పది లక్షల ఎకరాల భూమి పేదలకు పంచిన చరిత్ర కమ్యూనిస్టులదేనని గుర్తుచేశారు.ఇది జీర్ణించుకోలేని భూస్వాములు, పెత్తందారులు, నిజాంనవాబుతోతో కలిసి కుట్ర పన్ని భారత సైన్యాలకు లొంగిపోతున్నట్టుగా నాటకమాడి కుట్రలతో అమరుల విలువైన ప్రాణాల బలికి కారణ మయ్యారన్నారు.బీజేపీ ఎంతో గొప్పగా చెప్పుకుంటున్న సర్దార్ వల్లభారుపటేల్ నిజాం మెడలు వంచారని అతను ఉక్కుమనిషి అని కీర్తిస్తున్నారన్నారు.పటేల్ నిజామును నిజంగా మెడలు వంచితే అతను లొంగిపోయిన అనంతరం 'రాజ్య ప్రముఖ'గా ప్రకటించి గవర్నర్హోదా ఇచ్చారని చెప్పారు.ఇది జీర్ణించుకోలేని తెలంగాణ ప్రజలు భారతసైన్యాలకు కూడా వ్యతిరేకంగా సాయుధం నడిపించబడిన ఘనచరిత్ర పోరాటానికి ఉందన్నారు.కుట్రలు, కుతంత్రాలతో సాయుధపోరాటాన్ని నిర్వీర్యం చేయడమే కాకుండా, పేదలకు చిక్కిన భూమిని భూస్వాములకు అప్పజెప్పడం కోసం , ప్రయత్నాలు కొనసాగాయన్నారు. నేడు తెలంగాణ సాయుధ పోరాటం పేరు చెప్పి ఓట్లు దండుకోవాలని చూస్తున్నారని ఆయన తీవ్రంగా దుయ్యబట్టారు.మండలంలో సాయుధ పోరాటంలో పాల్గొన్న వారసులు బొమ్మ కంటిబాలరాజు , గ్యారసిద్ధయ్య, గ్యార చంద్రయ్య, దూసరి సత్తయ్య సతీమణి దూసరి మల్లమ్మ తో పాటు ఇతరులను శాలువాలతో సన్మానించారు.కేవీపీఎస్ జిల్లా ఉపాధ్యక్షులు జూకంటి పౌల్ ఆధ్వర్యంలో కళాకారులు, తెలంగాణ సాయుధ పోరాటవీరుల త్యాగాలను స్మరిస్తూ ప్రజానాట్యమండలి కళాకారులు ఆడిపాడారు.ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు మాటూరిబాలరాజు, కల్లూరి మల్లేశం, దాసరిపాండు, జిల్లా కమిటీ సభ్యులు ఎంఏ ఇక్బాల్, గడ్డం వెంకటేశ్, మండలకార్యదర్శి దూపటి వెంకటేశ్, సీఐటీయూ మండల కన్వీనర్ మోరిగాడి రమేశ్, సీనియర్ మోరిగాడి చంద్రశేఖర్, సీస రవి, ఘనగాని మల్లేష్, తాళ్లపల్లి గణేష్, నల్లమాస తులసయ్య, వడ్డేమాన్ విప్లవ్, చెన్నరాజేష్, కాసులనరేష్, భువనగిరి గణేష్, బుగ్గ నవీన్, చెక్క పరుశురాం, వడ్డేమాన్బాలరాజ్, మోరిగాడి రాజు,ఎక్కాల్దేవ్ భాస్కర్, బొప్పిడి యాదగిరి, చింతలనాగరాజు, ఎండిఅమీర్, సాయినికల్యాణ్, ప్రజా నాట్యమండలి సభ్యులు ముత్యాలు,బోడ హనుమంతు, మేడి ముకుంద, చెక్కిళ్ల ఉపేంద్ర పాల్గొన్నారు.