Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చివ్వెంల:గిరిజనుల అందరూ టీిఆర్‌ఎస్ ప్రభుత్వానికి రుణపడి ఉంటారని సేవలాల్ సేన మండల అధ్యక్షుడు భూక్యా నాగునాయక్ అన్నారు.ఆదివారం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ ఇన్నేండ్లుగా ప్రభుత్వాలు మారాయి.. పాలకులు మారే తప్ప గిరిజనుల జీవితంలో మాత్రం ఎటువంటి మార్పులు రాలేదన్నారు.కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గిరిజనుల పట్ల, గిరిజనఅభివృద్ధి ధ్యేయంగా 10శాతం రిజర్వేషన్, పోడుభూముల సమస్యలు, గిరిజన బంధు ప్రకటిస్తామని తెలియజేసిన సీఎం కేసీఆర్‌కు రుణపడి ఉంటారన్నారు. తండాలనుగ్రామపంచాయతీలుగా ఏర్పాటు చేసి అంధకారంలో ఉన్న తెలంగాణ రాష్ట్రానికి వెలుగులు నింపి 24 గంటల విద్యుత్‌ను యావత్ భారతదేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం అందించని విదంగా అందజేస్తున్నారని కొనియాడారు.