Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-తిరుమలగిరి
భూమి, భుక్తి విముక్తి కోసం నాటి రజాకార్లకు దేశ్‌ముఖ్‌ల దొరలకు వెట్టిచాకిరికి వ్యతిరేకంగా చేసిన పోరాటంలో అసువులు బాసిన అమరవీరులను ఘనంగా స్మరించుకుంటూ ఆదివారం తెలంగాణ సాయుద పోరాట వీరుల విజయోత్సవ సభ కార్యక్రమం తిరుమలగిరి క్రాస్‌రోడ్‌లో సామాజిక తెలంగాణ మహాసభ ఆధ్వర్యంలో నిర్వహించారు.ఈ సందర్భంగా సామాజిక తెలంగాణ మహాసభ రాష్ట్ర కన్వీనర్ కొత్త గట్టు మల్లన్న మాట్లాడారు.తెలంగాణ సాయుధ రాజధాని పోరాట వీరుల త్యాగాల ఫలితమే సెప్టెంబర్ 17 తెలంగాణకి విముక్తి కలిగిన రోజని అన్నారు.ఈ కార్యక్రమంలో జంబూ ద్వీప జనసమితి రాష్ట్ర కన్వీనర్ ఫత్తేపురం యాదగిరి,బీసీ సంక్షేమసంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు తన్నీరురామ్ ప్రభు, మహాజన సోషలిస్టు పార్టీ ఉమ్మడి నల్లగొండ జిల్లా ఇన్చార్జి కందుకూరి సోమన్నమాదిగ,గొల్ల కురుమల హక్కులపోరాటనవనిర్మాణసమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుక్కరాజుతిరుపతి, తెలంగాణగౌడ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు మొలకపూరి శ్రీకాంత్‌గౌడ్, బీసీసంక్షేమసంఘం రాష్ట్ర నాయకులు అనతుంల శ్రీనివాస్‌గౌడ, మండల అధ్యక్షులు పోరెళ్ల లక్ష్మయ్య,సీపీఐ(ఎం) నాయకులు నలుగురి రమేశ్, నాయకులు నజీర్, ఎండి.రెహమాన్, కందుకూరి బక్కరాములు, కొండ నర్సింహ, రాఘవరెడ్డి,వివిధ ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు.