Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డీసీఎంఎస్ చైర్మెన్ వట్టెజానయ్యయాదవ్
నవతెలంగాణ-సూర్యాపేట
పర్యావరణానికి హాని కలిగించే వస్తువులను బహిష్కరించి వెదురు వస్తువులను మళ్ళీ వాడకంలోకి తీసుకురావాలని ఉమ్మడి నల్లగొండ జిల్లా డీసీఎంఎస్ చైర్మెన్ వట్టెజానయ్యయాదవ్ అన్నారు.ప్రపంచ వెదురు దినోత్సవం సందర్భంగా స్థానిక కుడకుడరోడ్డులో జిల్లా మేదరి సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రపంచ వెదురు దినోత్సవంలో ఆయన పాల్గొని మాట్లాడారు. వెదురు వస్తువులను వాడి.... పర్యావరణాన్ని పరిరక్షించండి అనే నినాదం అందరిలో ఉండాలని కోరారు.వెదురు వస్తువులను తయారు చేసే మేదరి కుటుంబసభ్యులను, కార్మికులను అభినందిం చారు.వారికి ప్రభుత్వం అన్నివిధాలుగా సహకరిస్తుందని, వారికి కావాల్సిన సౌకర్యలను అందిస్తుందని ప్రభుత్వం తరపున హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో దూపహాడ్ సర్పంచ్ బిట్టు నాగేశ్వర్రావు, మేదరిసంఘం జిల్లా అధ్యక్షులు సలువయాదగిరి,జిల్లా ప్రధానకార్యదర్శి కోనమల్లయ్య, కొల్లూరి తిరుపతయ్య, శేర్ల వెంకన్న, నోములమల్లేశం,కల్లూరివెంకన్న, మామిడి ఉదరు పాల్గొన్నారు.