Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టాస్క్ ఫోర్స్ అధికారుల ఆకస్మికతనిఖీ
- 10 క్వార్టర్ బాటిళ్లను గుర్తించినవైనం
- మద్యం బాటిళ్లు సీజ్
- కొనసాగుతున్న విచారణ
నవతెలంగాణ-అనంతగిరి
టాస్క్‌ఫోర్స్ అధికారుల సోదాలలో కల్తీ మద్యం లభ్యమైన సమాచారం మండలవ్యాప్తంగా దూమారం లేపింది.నూతనంగా ఏర్పడిన అనంతగిరి మండల కేంద్రంలో జిల్లావ్యాప్తంగా టెండర్ల రూపంలో కేటాయించిన రెండు నూతన మద్యం దుకాణాలను ఏర్పాటు చేయడమైనది.ప్రతి వైన్స్‌షాప్‌లో సంబంధిత అధికారులు ఆకస్మికంగా దుకాణాల్లో తనిఖీలు నిర్వహించడం విధితమే.ఈ మేరకు ఆదివారం ఓ వైన్‌షాపులో ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ అధికారులు తనిఖీ చేయగా ఆ మద్యం దుకాణంలో సుమారు పది కల్తీ మద్యం క్వార్టర్ బాటిల్స్ లభ్యమైనట్టు సమాచారం.అదే రోజు వైన్స్‌షాప్‌లో మద్యం సేవించడానికి వచ్చిన కొందరు వ్యక్తులు మద్యం కల్తీ జరిగినట్టు వాగ్వాదానికి దిగిన వీడియో కూడా సామాజిక మాధ్యమాలలో హల్చల్గా మారింది.మద్యం కొనుగోలు చేయడానికి వచ్చిన కొందరు వ్యక్తులు మద్యంలో కల్తీ జరిగినట్టు తెలియడంతో యజమానులతో వాగ్వాదానికి దిగిన సమయంలో అక్కడే ఉన్న కొందరు వ్యక్తులు వీడియో చిత్రీకరించారు.తనిఖీలో అధికారులు స్వాధీనపరుచు కున్న క్వార్టర్ బాటిల్స్‌ను కోదాడ ఎక్సైజ్ పోలీస్‌స్టేషన్‌కు తరలించినట్టు సమాచారం.ఈ విషయంపై ఎక్సైజ్ సీఐ రాజ్యలక్ష్మీని వివరణ కోరగా టాస్క్‌ఫోర్స్ అధికారులు తనిఖీలో భాగంగా సుమారు పది కల్తీ మద్యం క్వార్టర్ బాటిళ్లు గుర్తించగా వాటిని సీజ్ చేసి సంబంధిత ఈ విషయంపై కేసు నమోదు చేసి పూర్తి విచారణ సాగుతుందన్నారు.