Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రజలను కొనుగోలు చేయొచ్చన్న భ్రమల్లో బీజేపీ
- కాంగ్రెస్ మండల సమన్వయ కమిటీ సమావేశంలో భట్టి విక్రమార్క
నవతెలంగాణ-మునుగోడు
నిజాం అహంకారానికి వ్యతిరేకంగా పోరాడి రజాకార్ల మెడలు వంచిన గడ్డ మునుగోడు అని స్పీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని పిఆర్ఆర్ ఫంక్షన్ హాల్ ఏర్పాటుచేసిన కాంగ్రెస్ మండల కార్యకర్తల సమన్వయ సమావేశంకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. బిజెపి, రాష్ట్రంలోని టీఆర్ఎస్ అధికారంలో ఉండి డబ్బుతో లొంగదీసుకోవచ్చన్న భ్రమలతో వందల కోట్లు తీసుకొచ్చి మునుగోడు ప్రజల ఆత్మగౌరవం పట్ల అహంకారపూరితంగా వ్యవహరిస్తున్నారన్నారు. మునుగోడు ప్రజలు సిద్ధాంతాల భావజాలానికి కట్టుబడి ఉంటారే తప్ప డబ్బులకు అమ్ముడుపోరు డబ్బు అహంకారాన్ని ప్రదర్శిస్తున్న బిజెపి , టిఆర్ఎస్ మెడల్ వంచడానికి మునుగోడు ప్రజలు సిద్ధంగా ఉండాలన్నారు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని బిజెపి సవాల్ చేస్తూ అడుగులు వేస్తూ అణగదొక్కుతు అధికారానికి డబ్బుకు అడ్డే లేదన్న అహంభావపూరిత వాతావరణంలో తెలంగాణ పై బిజెపి దాడి చేయడానికి వస్తున్నట్లు కనిపిస్తున్నదని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలను అనగదొక్కాలని చూసిన ప్రతి సందర్భంలో మట్టి మనుషులుగా ఎదిరించి ఎదురొడ్డి పోరాటం చేశారు తప్ప తలవంచుకున్న చరిత్ర ఈ పోరాటాల గడ్డ కు లేదని గుర్తు చేశారు. పేదలతో మమేకమై సామాన్యులతో కలిసిపోయి మునుగోడ్ను నియోజకవర్గ అభివద్ధి చేసి ప్రతి ఇంటి మనిషిగా ప్రజల హృదయాల్లో చిరస్థానాన్ని సంపాదించుకున్న దివంగత నేత పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి తనయురాలు స్రవంతి మునుగోడు ప్రజలకు సేవ చేయడానికి ముందుకొచ్చిందని స్రవంతిని ఆశీర్వదించి అసెంబ్లీకి పంపించడానికి మునుగోడు ప్రజలు సిద్ధమై ఉన్నారు అని ధీమా వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు శంకర్‌నాయక్, మాజీ ఎమ్మెల్యే విజయ రమణారావు, మాజీ ఎమ్మెల్సీలు ప్రేమ్‌సాగర్ రావు, పోట్ల నాగేశ్వరరావు, కిసాన్ సెల్ రాష్ట్ర అధ్యక్షులు అన్వేష్ రెడ్డి, రంగారెడ్డి డిసిసి అధ్యక్షులు నర్సిరెడ్డి, కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు నెమిండ్ల శ్రీనివాస్, సత్యనారాయణరావు, తదితరులు పాల్గొన్నారు.