Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నల్లగొండ
నల్లగొండ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో పేషంట్ కేర్, శానిటేషన్, సెక్యూరిటీ గార్డ్ల కొత్త టెండర్లు వెంటనే పూర్తి చేయాలని ఏఐటీయూసీ మెడికల్ కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి పల్లా దేవేందర్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం ఏఐటీయూసీ మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్ర హాస్పిటల్ ముందు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా దేవేందర్‌రెడ్డి మాట్లాడుతూ..టెండర్ కాలపరమితి ముగిసి రెండు సంవత్సరాల దాటుతున్న నేటికి కొత్త టెండర్లు పూర్తీ చేయకుండా కాలయాపన చేయడం విచారకరమన్నారు. 550 పడకలు ఉన్న జిల్లా కేంద్ర ఆస్పత్రిలో పడకల సంఖ్య నిర్ధారించడంలో రాష్ట్ర వైద్యాధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం ఎంతవరకు సమంజసం అని ఆయన ప్రశ్నించారు. సంవత్సరాల తరబడి కాలపరిమితి ముగిసిన పాత టెండర్లనే కొనసాగించడం వల్ల కార్మికులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాలోని మిగతా ఆసుపత్రిలో టెండర్లు వేసినప్పటికీ వాటిని పూర్తి చేసి కొత్త వేతనాలు ఇవ్వడంలో తీవ్రంగా జాప్యం జరుగుతుందని ఆరోపించారు. జీవో నెంబర్ 21 అమలు చేసి పంతొమ్మిది వేల రూపాయల వేతనం ఇవ్వాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ నాయకులు యాదగిరి, విజరు, లింగస్వామీ, నిర్మల, ఎల్లమ్మ, పద్మ, మల్లిక, అండాలు, మౌలాబి, జయమ్మ, శ్రీదేవి, శ్యామల,బాగ్యమ్మ, పార్వతమ్మ, విజయ, తదితరులు పాల్గొన్నారు.