Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- స్వాతంత్య్ర సమర యోధులు, కళాకారులకు సన్మానం
నవతెలంగాణ-నల్లగొండ కలెక్టరేట్
తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలను పురస్కరించుకొని నల్లగొండ జిల్లా కేంద్రంలో చిన వెంకట్‌రెడ్డి ఫంక్షన్ హాల్లో ఆదివారం నిర్వహించిన తెలంగాణ సంస్కృతి, జాతీయ సమైక్యత, దేశభక్తిని చాటేలా కళాకారులు, విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కతిక కార్యక్రమాలు ఆధ్యాంతం అలరించాయి. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన జెడ్పీ చైర్మెన్ బండ నరేందర్ రెడ్డి, శాసన సభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి, ఎస్పీ రెమా రాజేశ్వరి, అదనపు కలెక్టర్లు రాహుల్ శర్మ, భాస్కర్‌రావు, మున్సిపల్ చైర్మెన్ యం. సైదిరెడ్డి, జెడ్పీ వైస్ చైర్మన్ ఇరిగి పెద్దులు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. చిందు యక్షగానం దేశ భక్తి గేయాలు,నత్యాలు నాటికలు తెలంగాణ గేయాలతో కళాకారులు ఆహుతులను ఉర్రూతలూగించగా, జాతీయ సమైక్యత,స్వాతంత్య్ర స్ఫూర్తిని విద్యార్థులు నాటికలు ప్రదర్శనలతో కళ్ళకు కట్టినట్లు ప్రదర్శించి అలరింపజేశారు. ఈ సందర్భంగా జెడ్పీ చైర్మెన్ బండ నరేందర్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రాంతం 1948 సెప్టెంబర్ 17వ తేదీన సువిశాల భారతదేశంలో అంతర్భాగమై 75వ సంవత్సరంలోకి అడుగిడిన శుభతరుణాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలను అట్టహాసంగా నిర్వహిస్తోందన్నారు. శాసన సభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి, భాస్కర్‌రావులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఆదేశాల ననుసరించి ఈ నెల 16 ఉత్సవాల ప్రారంభం సందర్భంగా చేపట్టిన సమైక్యతా ర్యాలీల్లో ప్రతీ సెగ్మెంట్లో సగటున 15 వేల మంది చొప్పున అన్ని వర్గాల వారు జాతీయ జెండాలను ప్రదర్శిస్తూ ర్యాలీల్లో భాగస్వాములై జాతీయ భావాన్ని చాటారని అన్నారు. ఈ 17, 18వ తేదీలలో కొనసాగిన కార్యక్రమాలు కూడా ఎంతో గొప్పగా జరిగాయన్నారు. అదనపు కలెక్టర్ రాహుల్‌శర్మ, ఎస్.పి. రె మా రాజేశ్వరిలు మాట్లాడుతూ తెలంగాణ సమాజంతో కళలకు విడదీయరాని బంధం ఉందని, ఈ ప్రాంత ప్రజల జీవితాల్లో కళలు మమేకం అయి ఉన్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా స్వాతంత్య్ర సమర యోధులు, కళాకారులను ప్రజాప్రతినిధులు ఘనంగా సన్మానించారు.