Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రైతుసంఘం రాష్ట్ర నాయకులు ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి
నవతెలంగాణ-నల్లగొండ
రైతాంగం పండించిన పంటలకు పార్లమెంట్లో కనీస మద్దతు ధర చట్టం చేయాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర నాయకులు ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని డాక్టర్స్ కాలనీలోని సిద్ధార్థ డిగ్రీ కాలేజీలో తెలంగాణ రైతు సంఘం పట్టణ మహాసభ జరిగింది. ఈ సభకు ముఖ్యఅతిథిగా హాజరైన సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ..కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ శక్తులకు అంటగట్టాలని ప్రయత్నించి మూడు రైతు వ్యతిరేక చట్టాలను తెచ్చిన సందర్భంలో దేశవ్యాప్తంగా రైతాంగం సంవత్సరం పాటు ఢిల్లీ నడిబొడ్డున ధర్నాలతో పోరాడి ప్రభుత్వాన్ని రైతు వ్యతిరేక చట్టాలను వెనక్కి తీసుకునే విధంగా చేశారని గుర్తు చేశారు. ఆ పోరాట స్ఫూర్తితో కనీస మద్దతు ధర చట్టం చేయాలని విద్యుత్ సంస్కరణల బిల్లును రద్దు చేయాలని జరిగే పోరాటంలో రైతాంగం పాల్గొనాలని పిలుపునిచ్చారు. స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం రైతాంగానికి పంట రుణాలు ఇవ్వాలని, ఏకకాలంలో లక్ష రూపాయల రుణాన్ని మాఫీ చేయాలని, పంటకు అవసరమైన రుణాలను సకాలంలో ఇస్తూ నకిలీ విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు మార్కెట్లోకి రాకుండా నివారించడానికి ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బండా శ్రీశైలం మాట్లాడుతూ..సెప్టెంబర్ 22న మిర్యాలగూడలో రైతు సంఘం నల్లగొండ జిల్లా మహాసభలు జరుగుతున్నాయని, నవంబర్ నెలలో నల్లగొండ జిల్లా కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర మహాసభలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ మహాసభలకు రైతాంగం పెద్ద ఎత్తున హాజరై జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ మహాసభలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు ఎండి సలీం, జిల్లా సహాయ కార్యదర్శి దండెం సత్తయ్య, ఐద్వా జిల్లా ఉపాధ్యక్షురాలు తుమ్మల పద్మ, రైతు సంఘం సీనియర్ నాయకులు ఊట్కూరు నారాయణరెడ్డి, ఐద్వా పట్టణ కార్యదర్శి భూతం అరుణ పాల్గొని సహర్ద సందేశాలిచ్చారు.
నల్లగొండ పట్టణ నూతన కమిటీ ఎన్నిక..
తెలంగాణ రైతు సంఘం నల్లగొండ పట్టణ నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా పిన్నపురెడ్డి మధుసూదన్‌రెడ్డి, ఉపాధ్యక్షులుగా మైల యాదయ్య, దండెంపల్లి యాదయ్య, ప్రధాన కార్యదర్శిగా కుంభం కృష్ణారెడ్డి, సహాయ కార్యదర్శులుగా ఊట్కూరి మధుసూదన్ రెడ్డి, మన్నె శంకరయ్య, కోశాధికారిగా మేకల రవీందర్‌రెడ్డి, కార్యవర్గ సభ్యులుగా గడ్డం రాములు, సలివోజు విష్ణుమూర్తి, కళ్లెం బుచ్చిరెడ్డి, బొమ్మ నాగరాజు, మందడి రామచంద్రారెడ్డి,పాక మల్లయ్య, బొడ్డు పరమేశ్, నకేరేకంటి జానయ్యలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా నాయకులు కుంభం కృష్ణారెడ్డి, పిన్నపురెడ్డి మధుసూదన్ రెడ్డి, మేకల రవీందర్ రెడ్డి, ఊట్కూరి మధుసూదన్ రెడ్డి, గడ్డం రాములు, దండెంపల్లి యాదయ్య, పనస చంద్రయ్య, సల్లోజు విష్ణుమూర్తి, మన్నె శంకరయ్య, కళ్లెం బుచ్చిరెడ్డి, బొడ్డు పరమేష్, మారయ్య, కట్ట అంజయ్య, భాస్కర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.