Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎండి.జహంగీర్
నవతెలంగాణ-రాజపేట
తెలంగాణ సాయుధ పోరాటం చింతలపూడి రామిరెడ్డి విగ్రహాన్ని ట్యాంక్‌బండ్ మీద ఏర్పాటు చేయాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎండి జహంగీర్ డిమాండ్ చేశారు.ఆదివారం వీర తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాల ముగింపు సందర్భంగా మండలంలోని రేణిగుంట గ్రామంలో వీరతెలంగాణ సాయుధ పోరాటఅమరుడు చింతలపూడి రాంరెడ్డి విగ్రహానికి పూలమాలలేసి నివాళులర్పించారు.అనంతరం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు మంగ నరసింహులు అధ్యక్షతన జరిగిన బహిరంగసభలో ఆయన మాట్లాడారు.దేశ చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించబడిన వీర తెలంగాణ సాయుధ పోరాటంలో ప్రజలందరూ పాల్గొన్నారన్నారు.చరిత్రను కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ వక్రీకరించి ప్రజలను తప్పుదోవ పట్టిస్తుందని విమర్శించారు.1948 సెప్టెంబర్ 17న నైజాం నవాబు విడిచిపెట్టిన తెలంగాణ రాష్ట్రం భారతదేశంలో విలీనమైందంటే దానికి ప్రధానకారణం కమ్యూనిస్టులో పోరాటం అనేకమంది ఉన్నారన్నారు.ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహ, బట్టుపల్లి అనురాధ, గ్రామ సర్పంచ్ బూరుగు భాగ్యమ్మ, ఎంపీటీసీ బొద్దుల మౌనిక, సింగిల్ విండో చైర్మెన్ బొద్దుల ప్రభాకర్‌రెడ్డి, మదర్ డెయిరీ డైరెక్టర్ చింతలపూడి వెంకటరామిరెడ్డి, జిల్లా కార్యదర్శివర్గసభ్యులు మాటూరి బాలరాజు,దాసరి పాండు, జిల్లా కమిటీ సభ్యులు బబ్బూరు పోశెట్టి, గడ్డం వెంకటేశ్, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి వనంరాజు,పీఎన్ఎం జిల్లా కార్యదర్శి ముత్యాలు, రాజపేట మండల కార్యదర్శి బబ్బూరి శ్రీను తదితరులు పాల్గొన్నారు.