Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రజలను ఏకం చేయడమే లక్ష్యంగా పాదయాత్ర
- కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి బీర్ల అయిలయ్య
నవతెలంగాణ-యాదగిరిగుట్ట
దేశంలో ప్రధాని మోడీ, రాష్ట్రంలో సీఎంకేసీఆర్ ప్రజలను మోసం చేస్తున్నారని, ప్రజలను ఐక్యం చేయడం కోసమే రాహుల్‌గాంధీకి మద్దతుగా తాను పాదయాత్ర చేస్తున్నానని కాంగ్రెస్ నియోజక వర్గ ఇన్చార్జి బీర్ల అయిలయ్య అన్నారు.మండంలోని మహబూబ్ పేట గ్రామం నుండి భారత్‌జోడో పాదయాత్ర ఆదివారం ప్రారంభమైంది.మండలంలోని కొలనుపాకలో ప్రారంభం అయిన పాదయాత్ర యాదగిరిగుట్ట మండలం మహబూబ్ పేట,మర్రిగూడెం, చొల్లేరు,వంగపల్లి, రామాజిపేట,పెద్దకందుకూరు,చిన్న కందుకూరు గ్రామాల మీదుగా కొనసాగింది. యాదగిరి గుట్ట మండలంలోని గ్రామాల్లో తిరుగుతూ ప్రజల సమస్యలు తెలుసుకొని కాంగ్రెస్ అధికారంలోకి వస్తే జరిగే లాభాలను వివరించారు.ప్రజల సమస్యలను తెలుసుకొని పరిష్కారం కోసం ప్రభుత్వంపై పోరాటం చేయడానికే పాదయాత్ర నిర్వహిస్తున్నామన్నారు.తెలంగాణ తొలి ముఖ్యమంత్రి దళితుడని చెప్పిన కేసీఆర్ హామీని నిలబెట్టుకోకపోయారన్నారు.రుణమాఫీ ఊసెరుగని టీఆర్ఎస్ రైతుల చేతిలో చావుదెబ్బ తినడం ఖాయమన్నారు.దళితులకు మూడెకరాల భూమి ఎటుపోయిందని, డబుల్ బెడ్రూం ఇండ్లు ఏవని ప్రశ్నించారు.కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో అమలుచేసిన పథకాలు అధికారంలోకి రాగానే అమలు చేస్తామన్నారు. కేంద్రంలో మోడీ ప్రతి వస్తువుపై జీఎస్టీ వేసి ప్రజలపై భారం మోపారన్నారు. రాహుల్‌గాంధీ ప్రధానమంత్రి ఆయితే గ్యాస్ రూ.500కే అందజేస్తారని అన్నారు.అటు కేంద్రంలో మోడీ ప్రభుత్వం ప్రభుత్వ ఆస్తులను అమ్ముకుంటుపోతూ అన్నింటిపై ధరలను పెంచి పేద ప్రజలకు అన్యాయం చేస్తుందన్నారు.తెలంగాణ ప్రభుత్వం ఏర్పడినప్పుడు మిగులు బడ్జెట్‌తో ఉన్న రాష్ట్రం అప్పుల తెలంగాణగా మార్చిన కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దెదింపే వరకు కాంగ్రెస్ పోరాటం ఆగదన్నారు.పాదయాత్రలో యాదగిరిగుట్ట ఆలేరు ఎంపీపీలు చీర శ్రీశైలం గంధమల్ల అశోక్,మండల అధ్యక్షుడు బాలరాజు,పట్టణ అధ్యక్షుడు గుల్లపల్లి భరత్,నాయకులు శంకర్‌నాయక్, నమిలె మహేందర్‌గౌడ్,ఎంఏ ఎజాజ్, ముక్కర్ల మల్లేష్‌యాదవ్ పాల్గొన్నారు.