Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మిర్యాలగూడ
నిడమానూరు వద్ద సాగర్ ఎడమకాల్వకు పడిన గండిని యుద్ధ ప్రాతిపదికన పూడ్చలని రైతు సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ బంటు వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. ఆదివారం రైతు సంఘం ఆధ్వర్యంలో మండలంలోని ముల్కల కాల్వ మేజర్ కింద నీరందక ఎండిన పొలాలను పరిశీలించి మాట్లాడారు. నాగార్జునసాగర్ ఎడమ కాలువ కు గండి పడి 10 రోజులు దాటినా గండి పుడ్చటంలో ఎన్ఎస్పి అధికారులు, ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టుగా కనపడుతుందన్నారు. ఎకరానికి 30 నుండి 40 వేలు పెట్టుబడి పెట్టి వరి సాగు చేస్తున్న రైతులకు నీళ్లు బందు కావడం వలన నష్టం ఏర్పడుతుందని తెలిపారు. నష్టపోయిన రైతులను ప్రభుత్వం అన్ని విధాల ఆదుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో రైతులు పసుల వెంకన్న, గువ్వల పవన్, తదితరులు పాల్గొన్నారు.