Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఐటీయూ జిల్లా కార్యదర్శి దాసరిపాండు
నవతెలంగాణ-ఆలేరురూరల్
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు యాజమాన్యానికి వత్తాసు పలుకుతున్నాయని సీఐటీయూ కార్యదర్శి దాసరి పాండు విమర్శించారు.ఆదివారం సిఐటియు ఆధ్వర్యంలో మండల పరిధిలోని టంగుటూరు గ్రామంలో ఉన్న గౌతమి ఎక్స్ పోజ్ కంపెనీ కార్మికుల జనరల్ బాడీ సమావేశం అయోధ్య అధ్యక్షతన నిర్వహించారు.ఈసందర్భంగా ఆయన మాట్లాడారు.కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కంపెనీ యాజమాన్యానికి వత్తాసు పలుకుతూ కనీస వేతనాలు చెల్లించకుండా కార్మిక చట్టాలు అమలు చేయకుండా కార్మికుల శ్రమ దోపిడీ చేస్తున్నాయని విమర్శించారు.అనేక పోరాటాలు చేసి సాధించుకున్న చట్టాలను అమలు చేయడం లేదన్నారు.జీఎస్టీ పేరుతో కార్మికులపైన రోజురోజుకు భారాలు మోపుతున్నారని ఇతర రాష్ట్రాల కార్మికులచే పని చేయించుకుంటూ కనీస సౌకర్యాలు కల్పించడం లేదన్నారు.కార్మికవ్యతిరేక విధానాలపై పోరాటాలకు సిద్ధం కావాలని కోరారు.ఈ సమావేశంలో మండల కన్వీనర్ మొరిగాడి రమేష్,నాయకులు వీరేశం ,రాజేష్,మల్లేశం, జంగయ్య,శ్రీధర్, బాలరాజు, నర్సయ్య, బాలనర్సింహ, వీరస్వామి, కృష్ణ పాల్గొన్నారు.