Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-యాదగిరిగుట్ట
దేశంలోనే అనేక రాష్ట్రాల మేధావులు రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన పథకాలపై సంతృప్తి వ్యక్తం చేస్తూ ఆయన్ను దేశ రాజకీయాల వైపు రావాలని ఆహ్వానిస్తున్నారని,ఈ సమయంలో తెలంగాణ రాష్ట్ర లో ఉన్న ప్రజలు ఏకం కావాల్సిన అవసరం ఎంతైనా ఉందని డీసీసీబీ చైర్మెన్, టెస్కాబ్ వైస్‌చైర్మెన్ గొంగిడి మహేందర్‌రెడ్డి అన్నారు.ఆదివారం ఆయన తన నిలయంలో విలేకర్లతో మాట్లాడుతూ దేశవ్యాప్తంగా రైతుబంధు, రైతుబీమా, ఆసరా పెన్షన్లు రావాలంటే కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి వెళ్లాల్సిందేనన్నారు.నాటి కాలంలో చరణ్‌సింగ్,దేవీలాల్ లాంటి రైతు నాయకులు రాజకీయాల్లో ఉండి రైతుఅనుకూల నిర్ణయాలు తీసుకున్నారని తెలిపారు.ప్రస్తుతం దేశంలో రైతునాయకులు లోటును పూడ్చేందుకు కెేసీఆర్ కచ్ఛితంగా జాతీయ రాజకీయాల్లోకి రావాలన్నారు.ఇటీవలే 29 రాష్ట్రాల రైతు నాయకులు కోరడం తెలిసిందేనన్నారు.సీఎం కేసీఆర్ ప్రధాని కావాలని ఆకాంక్షించారు.ఈ సమావేశంలో మార్కెట్ కమిటీ చైర్మన్ గడ్డమీద రవీందర్ ,టిఆర్ఎస్ నాయకులు మిట్ట వెంకటయ్య ,గూదే బాల్ నరసయ్య తదితరులు పాల్గొన్నారు
టీఆర్ఎస్లో చేరిన 250 మంది కాంగ్రెస్ కార్యకర్తలు
బొమ్మలరామారం మండల పరిధిలోని హాజీపురం గ్రామానికిచెందిన కాంగ్రెస్ నాయకులు పల్లె ప్రదీప్ ,జంగయ్య,దాసరి శ్రీపాల్‌రెడ్డి,తిరుమని ప్రకాష్‌గౌడ్,సీహెచ్ సుధాకర్ ఆధ్వర్యంలో సుమారు 250 మంది ఆదివారం డీసీసీబీ చైర్మెన్ గొంగిడి మహేందర్‌రెడ్డి నాయకత్వంలో టీఆర్ఎస్లో చేరారు.ఈ సందర్భంగా ఆయన వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.టీిఆర్‌ఎస్ చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై యువకులు వివిధ పార్టీల కార్యకర్తలు టీఆర్ఎస్లో చేరుతున్నారన్నారు.ఈ కార్యక్రమంలో వ్యవసాయమార్కెట్ కమిటీ చైర్మెన్ గడ్డమీద రవీందర్‌గౌడ్,టీఆర్ఎస్ బొమ్మలరామారం మండల అధ్యక్షుడు వెంకటేశ్, పీఏసీఎస్ వైస్‌చైర్మెన్ కుషాంగుల సత్యనారాయణ,నాయకులు రాంరెడ్డి, రామస్వామిగౌడ్, బీరప్ప, ఓరుగంటి సతీష్‌గౌడ్, మైలారంరామకృష్ణ పాల్గొన్నారు.