Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మున్సిపల్ చైర్మెన్ వెన్రెడ్డి రాజు
నవతెలంగాణ-చౌటుప్పల్
మున్సిపాలిటీ అభివృద్ధే తన లక్ష్యమని మున్సిపల్ చైర్మెన్ వెన్రెడ్డి రాజు తెలిపారు.సోమవారం మున్సిపల్ పరిధిలోని లక్కారంలోని 7,8 వార్డుల్లో సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రయినేజీ నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపాలిటీలో నెలకొన్న సమస్యలను అంచెలంచెలుగా పరిష్కరిస్తామన్నారు. వార్డుల్లోని ప్రజలు ఐఎన్ ఆగ్రో అనే కంపెనీ నుండి దుర్వాసన వస్తుందని, ఈ వాసన వల్ల చిన్న పిల్లలు, వద్ధులు అనేక అనారోగ్యాలకు గురవుతున్నారని తెలిపారు. స్పందించిన ఆయన కాలుష్య నియంత్రణ అధికారులకు ఫిర్యాదు చేసి అట్టి కంపెనీని మూసివేయిస్తామని హామీ ఇచ్చినట్టు తెలిపారు.ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు కాసర్ల మంజుల, కొయ్యడ సైదులుగౌడ్, బండమీది మల్లేశం, గ్రామ మాజీ సర్పంచ్లు పాశం సంజరుబాబు, కానుగు యాదమ్మబాలరాజు, ఎర్ర భుజంగం, నాయకులు పాశం కృష్ణయ్య, దేశెట్ల భిక్షం, లందగిరి యాదయ్య, ఎర్ర శంకర్, బద్రి బాలరాజు, కలమ్మ, లలిత, అంజయ్య పాల్గొన్నారు.