Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-భూదాన్‌పోచంపల్లి
ఉచిత వైద్య శిబిరాలు పేద ప్రజలకు వరం లాంటివని, గ్రామీణప్రాంతంలోని పేదప్రజలు ఉచితశిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని వైస్‌ఎంపీపీ పాక వెంకటేశం కోరారు.సోమవారం మండలపరిధిలోని మోహన్‌నగర్‌లో ఉచిత శిబిరాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు.కంటి అద్దాలు, టాబ్లెట్స్ ఆపరేషన్లు ఫ్రీగా చేయడం జరుగుతుందన్నారు.ఈ అవకాశాన్ని పేద ప్రజలు ఉపయోగించుకోవాలని కోరారు.మారుమూల గ్రామాల్లో ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి ప్రజలకు మంచి సేవ చేస్తున్న డాక్టర్స్‌ను ప్రజలు ఎప్పటికీ మర్చిపోరన్నారు.సుమారు 100 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి వారికి ఉచితంగా మందుల పంపిణీ చేశారు.అద్దాలు ఆపరేషన్లు కూడా చేయించేందుకు కృషి చేస్తామన్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ స్వాతి వెంకటేశం, టీఆర్ఎస్ మండల ప్రధానకార్యదర్శి చిలువేరు బాలనర్సింహ, గ్రామ సెక్రెటరీ శ్రీకాంత్‌రెడ్డి డాక్టర్ ఉమా మహేష్ డాక్టర్ శశికళ సిరసంగి చంద్రయ్య ఉప్పనూతుల మల్లేశం హాస్పిటల్ సిబ్బంది గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.