Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దళితున్ని సీఎం చేస్తానని మాట తప్పిన ముఖ్యమంత్రి
- కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి బీర్ల అయిలయ్య
నవతెలంగాణ యాదగిరిగుట్ట
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రూ.500 గ్యాస్ అందిస్తామని,దళితున్ని ముఖ్యమంత్రి చేస్తానని చెప్పి మాట తప్పిన కేసీఆర్ లాంటి వ్యక్తి తెలంగాణకు ఏ విధంగా అభివద్ధి చేస్తాడని కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి బీర్ల ఆయిలయ్య అన్నారు.సోమవారం రెండవ రోజు పాదయాత్రలో భాగంగా తాళ్లగూడెం, బాహుపేట,యాసోజుగూడెం, కుమ్మరిగూడెం, కాచారం, ధర్మారెడ్డిగూడెం, కంఠంగూడెం, సాదువెల్లి, గౌరాయిపల్లి,చిన్న గౌరాయపల్లి గ్రామాలలో పాదయాత్ర సాగింది.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాహుల్‌గాంధీ ప్రవేశపెట్టిన వరంగల్ డిక్లరేషన్ అంశాలను గుర్తుచేశారు.కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రూ.2లక్షల రైతు రుణమాఫీ చేస్తామని,రైతులకు,కౌలు రైతులకు ఎకరాకు రూ.15వేల పెట్టుబడి సాయం చేస్తామన్నారు.ఉపాధి హామీల్లో నమోదు చేసుకున్న భూమిలేని రైతుకూలీలకు ఏడాదికి 12వేల ఆర్థికసాయం చేస్తామని.పెండింగ్ ప్రాజెక్టులను వెంటనే పూర్తి చేసి చివరి ఏకరావరకు నీళ్లు అందిస్తామని ధీమా వ్యక్తం చేశారు.పండించిన పంటలన్నింటిని మద్దతు ధర తో కొంటామని.పోడు భూముల రైతులకు అసైన్డ్ భూముల లబ్దిదారులకు యాజమాన్య హక్కులు కల్పిస్తామన్నారు.ధరణి పోర్టల్ రద్దు చేస్తామని,సరికొత్త రెవెన్యూ వ్యవస్థ తీసుకోస్తామని ,రైతు కూలీలు, భూమి లేని రైతులకు సైతం రైతుబీమా పథకం వర్తింపు అయ్యేటట్లు చూస్తామన్నారు.వివిధ కారణాలతో పంట నష్టపోతే తక్షణం నష్టపరిహారం అందజేస్తామని వివరించారు.ఉపాధిహామీ చట్టాన్ని వ్యవసాయానికి అనుసంధాన చేస్తామని,మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఇందిరమ్మ ఇండ్లు నిర్మించి ఇస్తామని తెలిపారు.ఆలేరులో కాంగ్రెస్‌ను ఆశీర్వదించాలని కోరారు.ఈ పాదయాత్రలో ఎంపీపీ చీర శ్రీశైలం ఆలేరు ఎంపీపీ గందమల్ల అశోక్ నాయకులు కానుగు బాలరాజు గుండ్లపల్లి భరత్ ,వెంకటేశ్వరరాజు,రాంరెడ్డి, గుండు నర్సింహ, గుడ్ల నరేష్,బూడిద భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.