Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయం
- మాజీ మంత్రి గీతారెడ్డి
నవతెలంగాణ-చౌటుప్పల్
మతతత్వ బీజేపీని మునుగోడులో ఓడించాలని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి గీతారెడ్డి పిలుపునిచ్చారు.సోమవారం మున్సిపల్కేంద్రంలోని పీబీ గార్డెన్స్ లో మున్సిపాలిటీకి సంబంధించి పార్టీ వార్డుల అధ్యక్షులు, సమన్వయ కమిటీ సభ్యుల సమావేశం నిర్వహించారు.ఈ సమావేశానికి ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆమె మాట్లాడారు.మునుగోడు గడ్డ కాంగ్రెస్, సీపీఐల అడ్డ అన్నారు.298 బూతులకుగాను ఒక్కో బూతులో 254 ఓట్లు వేయించి మొత్తం 76వేల ఓట్లు సాధించడమే లక్ష్యంగా పెట్టుకోవాలన్నారు.బీజేపీ, టీఆర్ఎస్లు ఇతర పార్టీల కార్యకర్తలు, నాయకులను అనేక ప్రలోభాలకు గురిచేసి కొనుగోలు చేస్తున్నారని విమర్శించారు.కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ప్రభుత్వ సంస్థలను అదాని, అంబానీలకు అమ్ముతుందన్నారు.పేదలకు ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చిన చరిత్ర కాంగ్రెస్‌దేనన్నారు.మోడీ అధికారంలోకి వచ్చాక గ్యాస్, పెట్రోల్, డీజిల్, నిత్యావసర వస్తువుల ధరలు పెంచి పేదల నడ్డి విరుస్తున్నారన్నారు .రాజగోపాల్‌రెడ్డి కాంగ్రెస్‌పార్టీకి ద్రోహం చేశారన్నారు. స్వాతంత్య్రం తెచ్చింది, తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్సేనన్నారు .తెలంగాణ అప్పుల తెలంగాణగా మారింద న్నారు.రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్‌పార్టీ అధికారంలోకి రావడం ఖాయమ నిజోస్యం చెప్పారు.మునుగోడులో పార్టీని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.ఈ సమావేశంలో మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి, డీసీసీ అధ్యక్షులు కుంభం అనిల్‌కు మార్రెడ్డి, శివకుమార్‌యాదవ్, ఎమ్మెల్యే అభ్యర్థి పాల్వాయి స్రవంతి, డాక్టర్ శ్రవణ్‌కుమార్‌రెడ్డి, జనక్ ప్రసాద్, నర్సారెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, చల్లమల్ల కృష్ణారెడ్డి, సంధ్యారెడ్డి, నర్సింహారెడ్డి, విజరురెడ్డి, జ్యోత్స్న, ధనలక్ష్మీ, కల్పన, రేణుక, మంజుల, వరలక్ష్మీ, సుర్వి నర్సింహాగౌడ్, ఆకుల ఇంద్రసేనారెడ్డి, ముప్పిడి సైదులుగౌడ్, సుర్కంటి వెంకట్‌రెడ్డి, తొర్పునూరి ఈశ్వర్ పాల్గొన్నారు.