Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మోతె
అర్హులైన పేదలందరికీ ఇండ్లు, స్థలాలు, డబుల్బెడ్రూం ఇండ్లు ఇవ్వాలని వ్యవసాయకార్మిక సంఘం జిల్లా ప్రధానకార్యదర్శి మట్టి పెళ్లి సైదులు డిమాండ్ చేశారు.ఈవిషయమై సోమవారం స్థానిక తహసీల్దార్ కార్యాలయం ముందు ప్రజాసంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ప్రజాసమస్యల పరిష్కరించాలని కోరుతూ ధర్నా నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏడేండ్ల నుండి పేదలు ఇండ్లు స్థలాల కోసం ఎదురుచూస్తున్నా ప్రభుత్వం కనీసం పట్టించుకున్న పాపాన పోలేదన్నారు.మండలకేంద్రంతో పాటు అప్పన్నగూడెం,నాగయ్యగూడెంలో ఆరేండ్ల కింద డబుల్బెడ్రూం ఇండ్లు నిర్మించి ఇప్పటికీ లబ్దిదారులను గుర్తించిపట్టాలివ్వడంతో విఫలమయ్యారని విమర్శించారు.గ్రామంలో ఎస్సీ, ఎస్టీలకు ఉచిత విద్యుత్‌ను సరఫరా చేయాలని కోరారు.అనంతరం డిప్యూటీ తహసీల్దార్ సూరయ్యకు వినతిపత్రం అందజేశారు.ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) మండలకమిటీ సభ్యులు కాంపాటి శ్రీను ,సీఐటీయూ మండల కన్వీనర్ కిన్నెరపోతయ్య, డీవైఎఫ్ఐ మండలకార్యదర్శి వెలుగుమధు, కేవీపీఎస్ మండలనాయకులు బాపనపల్లి నాగయ్య,రైతుసంఘం మండల ఉపాధ్యక్షుడు కె.సత్యనారాయణ, సీఐటీయూ మండలనాయకులు గుంటగాని ఏసు, కల్లుగీత కార్మిక సంఘం మండల నాయకులు సోమగాని మల్లయ్య పాల్గొన్నారు.