Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆదనవుకలెక్టర్ ఎస్.మోహన్రావు
నవతెలంగాణ-సూర్యాపేటకలెక్టరేట్
ప్రజవాణి కార్యక్రమానికి అన్ని శాఖల జిల్లా అధికారులు హాజరుకావాలని అదనపు కలెక్టర్ ఎస్.మోహన్రావు ఆదేశించారు.సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రజావాణి కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరించి మాట్లాడారు.జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమానికి వివిధ శాఖలకు సంబంధించిన కొందరు అధికారులు,కింది స్థాయి సిబ్బందిని పంపిస్తున్నారని,దీనివలన దరఖాస్తుదారుని విన్నపాలు ఆలస్యం అవుతున్నాయని అన్నారు.అన్ని శాఖలవారిగా జిల్లా అధికారులు మాత్రమే తపక ప్రజావాణి కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా అధికారులను ఆదేశించారు.ప్రజల నుండి స్వీకరించిన అర్జీలను వెంటనే పరిష్కరించే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.ప్రజావాణి లో 54 దరఖాస్తులు వచ్చాయని తెలిపారు.అట్టి దరఖాస్తులను సంబంధిత శాఖల అధికారులు సత్వరమే పరిష్కరించాలని ఆదేశించారు.ఈ కార్యక్రమంలో ఏడీి సర్వే ల్యాండ్ రికార్డ్స్ ఎం.నాగేందర్, జిల్లా ఉపాధి కల్పనాధికారి ఎస్.మాధవరెడ్డి,వెనకబడిన కులాల అభివృద్ధి అధికారి అనసూయ, ఇరిగేషన్ అధికారి ప్రేమ్చంద్, ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అధికారి ఆర్.రవి,డీఎస్డీఓ దయానందరాణి,జీఎం ఇండిస్టియల్ తిరుపతయ్య, కార్యాలయ సూపరింటెండెంట్ సైదులు, సుదర్శన్, కలెక్టరేట్ ఏవో శ్రీదేవి, సిబ్బంది,అర్జీదారులు తదితరులు పాల్గొన్నారు.