Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళ్ళ అన్నపూర్ణ
నవతెలంగాణ-సూర్యాపేటరూరల్
మత్స్యకారుల ఆర్థిక బలోపేతానికే సీఎం కేసీఆర్ 100 శాతం ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమం చేపట్టారని మున్సిపల్ చైర్పర్సన్ పేరుమళ్ళ అన్నపూర్ణ అన్నారు.సోమవారం స్థానిక 12వ వార్డు పిల్లలమర్రి చెరువులో చేపల పంపిణీ కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. రాష్ట్ర ఏర్పాటు అనంతరం తెలంగాణ ప్రజల జీవన ప్రమాణాలు మెరుగయ్యాయని వివరిం చారు.సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో మంత్రిజగదీశ్రెడ్డి జిల్లాలో నీటివనరులు సమకూరాయన్నారు.జిల్లాలో 222 గ్రామాలకు రూ. 77 లక్షల నిధులతో చేపల పంపిణీ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా మత్స్యశాఖఅధికారిరూ పేందర్సింగ్, తహసీల్దార్వెం కన్న,టీఆర్ఎస్జిల్లా నాయకులుమారి పెద్దిశ్రీనివాస్ గౌడ్,వెంకన్న,టీఆనఖు
కౌన్సిలర్ బచ్చల కూరి శ్రీనివాస్, టీఆర్ఎస్ వార్డు అధ్యక్షులు చెరుకుపల్లి శ్రీనివాస్,నాయకులు ఈదుల యాదగిరి, రాపర్తి మహేష్ కుమార్, పిల్లలమర్రి మత్స్య పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షులు తూటిపల్లి మహేష్, మారబోయిన శ్రీను, తూటిపల్లి నాగయ్య పాల్గొన్నారు.