Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యే బొల్లంమల్లయ్య యాదవ్
నవతెలంగాణ-అనంతగిరి
నియోజకవర్గంలో అర్హులందరికీ ఆసరా పింఛన్లను ఇప్పిస్తానని ఎమ్మెల్యేబొల్లం మల్లయ్యయాదవ్ అన్నారు. సోమవారం మండలంలోని అమీనాబాద్,బొజ్జగూడెం తండా, మొగలాయికోట, కిష్ణాపురం గ్రామాలకు చెందిన లబ్దిదారులకు ఆసరాపింఛన్లను, సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేసి మాట్లాడారు.రాష్ట్రంలో ప్రతి గడపకు ముఖ్యమంత్రి కేసీఆర్ పథకాలు అందుతున్నా యన్నారు.రాష్ట్రవ్యాప్తంగా కొత్త పింఛన్లతో కలుపు కొని 46 లక్షల మందికి వికలాంగులు,వృద్ధులు,వితంతువులు, ఒంటరి మహిళలకు అందిస్తున్నామన్నారు.ఆసరా పింఛన్ల వల్ల లబ్దిదారుల ఆత్మగౌరవం పెరిగిందన్నారు. కోదాడ నియోజకవర్గంలో అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ రాజకీయలకతీతంగా సంక్షేమపథకాలు అందు తున్నాయన్నారు. ఇంకా పలుకారణాల వల్ల పెన్షన్ కార్డులు రాని అర్హత ఉన్న వాటిని పరిశీలన చేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంచే మంజూరు చేయించి కొత్త కార్డులను ఇచ్చే బాధ్యత తనదేనన్నారు.ఈ కార్యక్రమంలో మార్కెట్‌కమిటీ చైర్మెన్ బుర్ర సుధారాణిపుల్లారెడ్డి, మార్కెట్ కమిటీ వైస్‌చైర్మన్ ఉపేందర్ గౌడ్,ఎంపీపీ చుండూరువెంకటేశ్వర్లు, మండలఅధ్యక్షులు గింజుపల్లిరమేశ్, ఎస్టీ సెల్మండలఅధ్యక్షులు గుగులోత్ శ్రీనివాస్‌నాయక్, గునుకుల స్వరూప వెంకటరెడ్డి, ఆయా గ్రామాల సర్పంచులు,టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.