Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నల్లగొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
నవతెలంగాణ-హుజూర్‌నగర్‌టౌన్
తెలంగాణ రాష్ట్రంలో అధికార,ప్రతిపక్ష పార్టీల సర్పంచులకు, ప్రజాప్రతినిధులకు గౌరవం దక్కడం లేదని నల్లగొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు.సోమవారం హుజూర్‌నగర్‌లో కాంగ్రెస్ కార్యాలయంలో జిల్లాలోని పార్టీ సర్పంచులు, ప్రజాప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.రాష్ట్రంలో సర్పంచులు, ప్రజాప్రతినిధులకు సరైన నిధులు, విధులు లేక అడుగు అడుగున అవమానాలు భరిస్తూ బిల్లులు రాక ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం నిధులు విడుదల చేయకుండా అధికార, ప్రతిపక్ష సర్పంచుల రక్తాన్ని పీల్చుతుందన్నారు.పల్లె ప్రగతిలో చేసిన పనులకు నెలల తరబడి బిల్లులు రాక లక్షలాది రూపాయల పెండింగ్ బిల్లులతో సర్పంచులు ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారన్నారు.స్థానిక ఎమ్మెల్యే సైదిరెడ్డి నియోజకవర్గంలో ఉన్న సర్పంచుల తీర్మానం లేకుండానే లైట్లు,ట్రాక్టర్లు,చివరికి బ్లీచింగ్ ఫౌడర్ కొనుగోలు చేసి భారీ అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు.కొంత మంది మండల అభివృద్ధి అధికారులు బ్లీచింగ్ ఫౌడర్లు కొనుగోలు చేసి గ్రామ పంచాయతీలకు సరఫరా చేస్తున్నారని వారు గ్రామ పంచాయతీకి సరఫరా చేసే అవసరం ఏంటని ప్రశ్నించారు.జిల్లా పరిషత్ సమావేశంలో అంత భేష్ అని అధికారులు క్లీన్ చీట్ ఇస్తున్నారన్నారు.క్షేత్రస్థాయిలో సర్పంచులను అడిగితే సమస్యల చిట్ట చెబుతున్నారని పేర్కొన్నారు.సర్పంచులకు రావాల్సిన పల్లెప్రగతి బిల్లులు జెడ్పీ సమావేశంలో తాను ప్రశ్నించడం వలనే కొంత నిధులు మంజూరయ్యాయని గుర్తు చేశారు. హుజూర్నగర్ మండలం గోపాలపురం సర్పంచ్‌కు తెలియకుండా తీర్మానం లేకుండానే సీఎం ప్రతిగ్రామానికి ఇచ్చిన ఎస్డీఎఫ్ నిధులు రూ.20 లక్షల పనులను అధికార పార్టీ నాయకులు ఎమ్మెల్యే సైదిరెడ్డి అండ దండలతో దొడ్డి దారిన పనులు చేపట్టారన్నారు.తీర్మానం ఇవ్వకుంటే అధికారులతో బెదిరింపులకు పాల్పడి గ్రామపంచాయతీ రికార్డుల్ని జిల్లా అధికారులు దౌర్జన్యంగా ఎత్తుకెళ్లారని ఆగ్రహం వ్యక్తం చేశారు.నడిగూడెం మండం కరివిరాలలో ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్,కలెక్టర్ వినరు కృష్ణారెడ్డిలు కలిసి కాంగ్రెస్ మహిళ సర్పంచ్‌పై తప్పుడు ఆరోపణలు చేసి సస్పెండ్ చేశారన్నారు.దీన్ని పూర్తి స్థాయిలో ఖండిస్తున్నామన్నారు.ముఖ్యమంత్రి 24 గంటలు కరెంటు ఇస్తున్నా అని అబద్ధపు ప్రచారం చేస్తున్నారని గ్రామాల్లో 12 గంటలు కూడా కరెంటు రావడం లేదన్నారు.ప్రభుత్వం ఉండేది ఆరు నెలలు మాత్రమేనని ఈ అవినీతి ఎమ్మెల్యేలు ఎటు పోతారో చూద్దామన్నారు.ఎస్టీఓలు, సంబంధిత అధికారులు సర్పంచులల దగ్గర కమీషన్లు తీసుకోవడం మానుకోవాలని హెచ్చరించారు.అనంతరం మఠంపల్లి మండల యూత్ కాంగ్రెస్ సమావేశంలో పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పట్టణఅధ్యక్షులు తన్నీరు మల్లికార్జున్‌రావు, బ్లాక్‌కాంగ్రెస్ అధ్యక్షులు అరుణ్‌కుమార్ దేశముఖ్,రాష్ట్ర సీనియర్ నాయకులు సాములశివారెడ్డి, ఎంపీపీ గోపాల్, జెడ్పీటీసీ మోతీలాల్, మంజు నాయక్,కొణతం చిన్నవెంకటరెడ్డి, అంజన్‌రెడ్డి, గోవిందరెడ్డి,కొట్టే సైదేశ్వర్రావు, బచ్చలకూరిబాబు, కుక్కడపుమహేష్,ముక్కంటి, కృష్ణ, రాము,జితేందర్‌రెడ్డి, కాంగ్రెస్ సర్పంచులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.