Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ట్రైకార్ చైర్మెన్ రాంచందర్‌నాయక్
నవతెలంగాణ-మిర్యాలగూడ
రాష్ట్రంలో ఔత్సాహిక గిరిజన యువకులకు పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం రూ.150 కోట్లు కేటాయించినదని రాష్ట్ర గిరిజన సహకార అభివృద్ధి సంస్థ (ట్రైకార్) చైర్మెన్ రాంచందర్‌నాయక్ తెలిపారు. సోమవారం స్థానిక ఎన్ఎస్పీ అతిధి గృహంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సిఎం ఎంటర్ ప్యునర్ స్కీం కింద ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ఆధ్వర్యంలో 100 మంది యువకులకు శిక్షణ ఇస్తారని తెలిపారు. శిక్షణ పొందిన అనంతరం ఒక కోటి నుండి రెండు కోట్ల రూపాయలు ఆర్థిక సహాయం అందిస్తోందన్నారు. సిఎం గురివించ్ కింద ఇద్దరు గిరిజన రైతులకు బోర్లు వేసేందుకు 3 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం అందిస్తోందన్నారు. రాష్ట్రంలో నాలుగు ఐటిడిఎలున్నాయని, మైదానం ప్రాంత ఐటిడిఎ ఏర్పాటుకు ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు తెలిపారు. గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్లు అమలు జిఓ వారం పదిరోజుల్లో రానున్నట్టు తెలిపారు. చట్టపరంగా ఇబ్బందులు రావద్దన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వానికి బిల్లు పంపితే ఆమోదం తెలపకుండా పెండింగ్‌లో తమ వద్దకు రాలేదని బుకాయించిందన్నారు. 200 కోట్ల విలువైన బంజారా భవన్ సేవాలాల్ ఇచ్చి గిరిజనుల కలను సిఎం కెసిఆర్ సాకారం చేశారన్నారు. ఈ సమావేశంలో బంజారా సంఘం నియోజకవర్గ అధ్యక్షుడు డి.చిట్టిబాబునాయక్, దామరచర్ల, అడవి దేవులపల్లి ఎంపిపిలు, జడ్పీటీసీ నందిని రవితేజ, బాలాజీ నాయక్, లలిత హాతిరాం, సర్పంచ్‌లు రవీంద్ర నాయక్, పాచునాయక్ తదితరులున్నారు.