Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కొండమల్లేపల్లి:ఓ యువకుడి చావుకు కారణం అంటూ గ్రామస్తులు ఇద్దరు మహిళలపై దాడి చేసి శిరోమండనం చేయించిన సంఘటన ఆదివారం రాత్రి కొండమల్లేపల్లి మండల పరిధిలోని రాముని గుండ్ల తండా గ్రామంలో చోటు చేసుకుంది. ఎస్సై నారాయణరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన రామావత్ రాజు (16) ఇంటర్మీడియట్ చదువుతున్నాడు. అదే గ్రామానికి చెందినటువంటి రామాత్ కమ్లి, రమావత్ అచ్చి దేవరకొండ పట్టణంలో వ్యభిచారాలు చేస్తుంటారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన రాజు అనే బాలుడితో పరిచయం ఏర్పరచుకొని ఫోన్లో బాలుడుతో డబ్బుల కోసం సంభాషణ చేయడంతో రాజు ఆత్మహత్య చేసుకున్నాడన్న అనుమానంతో ఆగ్రహించినటువంటి గ్రామస్తులంతా సమావేశం ఏర్పరచుకొని ఆదివారం రాత్రి గ్రామంలో ఇద్దరి మహిళలకు శిరమండలం చేయించారు. ఈ సందర్భంగా సోమవారం రామావత్ కమ్లి అనే బాధితు రాలు స్థానిక పోలీస్ స్టేషన్లో గ్రామానికి చెందిన 8 మంది వ్యక్తులపైన ఫిర్యాదు చేసింది. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ నారాయణరెడ్డి తెలిపారు.