Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నల్లగొండ
ప్రభుత్వ స్థలాల్లో గుడిసెలు వేసుకున్న పేదలకు పట్టాలు ఇవ్వాలని, ఇంటి స్థలం ఉన్న వారి ఇంటి నిర్మాణం కోసం ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 23 న తెలంగాణ ప్రజా సంఘాల పోరాట వేదిక ఆధ్వర్యంలో నల్లగొండ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు నిర్వహిస్తున్న ధర్నాను జయప్రదం చేయాలని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఐద్వా నల్లగొండ జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు ప్రభావతి కోరారు. సోమవారం ఐద్వా నల్లగొండ జిల్లా కమిటీ సమావేశం జిల్లా అద్యక్షురాలు పోలెబోయిన వరలక్ష్మి అధ్యక్షతన స్థానిక దొడ్డి కొమరయ్య భవన్లో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అర్హులైన పేదలందరికీ 120 గజాల ఇంటి స్థలం ఇవ్వాలని, అర్హులైన పేదలందరికీ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇవ్వాలని, జిల్లాలో నిర్మితమైన డబుల్ బెడ్రూమ్ ఇండ్లను వెంటనే పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. నల్లగొండ ప్రభుత్వ దవాఖానలో నిర్లక్ష్యంగా వైద్యం చేసి అఖిల మతికి కారణమైన బాధ్యులపైన వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రభుత్వ దవాఖానల్లో మెరుగైన వైద్యం అందించుటకు సౌకర్యాలు కల్పించాలన్నారు. మహిళా పొదుపు సంఘాల గ్రూపులకు పావలా వడ్డీ ఇవ్వడం లేదని ఎన్ని పర్యాయాలు ఆందోళన చేసినప్పటికీ ప్రభుత్వం నుండి స్పందన కరువైందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐద్వా రాష్ట్ర కమిటీ సభ్యురాలు కొండా అనురాధ, జిట్ట సరోజా, జిల్లా సహాయ కార్యదర్శి కారంపూడి ధనలక్ష్మి, భూతం అరుణకుమారి, పాదూరి గోవర్ధన, జిల్లా కమిటీ సభ్యులు కనుకుంట్ల ఉమారాణి, గోలి వేంకటమ్మ , నాగమణి, చైతన్య, ప్షులమ్మ తదితరులు పాల్గొన్నారు.