Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు తుమ్మల వీరారెడ్డి
నవతెలంగాణ-నల్లగొండకలెక్టరేట్
మధ్యాహ్న భోజన కార్మికులకు అసెంబ్లీలో రూ.2000 పెంచుతూ ప్రకటించిన వేతనం అమలుకు జీవోను విడుదల చేయాలని, మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు పరిష్కరించాలని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు తుమ్మల వీరారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర మధ్యాహ్న భోజన కార్మిక సంఘం సీఐటీయూ పిలుపులో భాగంగా సోమవారం నల్లగొండ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు నిర్వహించిన ధర్నాలో ఆయన పాల్గొని మాట్లాడారు. మధ్యాహ్న భోజన కార్మికులు పథకం మొదలైన నాటి నుండి అనేక ఆటుపోట్లు ఎదుర్కొంటూ విద్యార్థులకు రుచికరమైన పౌష్టిక ఆహారం అందిస్తున్నారని, కానీ ప్రభుత్వం వారికి కనీస వేతనం నేటికి అమలు చేయకపోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నెల 23, 24 తేదీలలో ఇందిరాపార్కు వద్ద జరిగే వంటావార్పు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యులు రొండి శ్రీను, రాజ్యలక్ష్మి, ఫాతిమా, బిక్షపొమ్మ, అనురాధ, పుష్పలత, మల్లమ్మ, అలివేలు, లింగమ్మ , సిహెచ్ మల్లమ్మ, తదితరులు పాల్గొన్నారు.