Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చౌటుప్పల్:ట్రిబుల్ఆర్ భూ నిర్వాసితులకు భూమికి బదులు భూమి, లేదా ప్రస్తుత మార్కెట్ రేట్ ఇవ్వాలని తెలంగాణ రైతుసంఘం జిల్లా నాయకులు బూర్గు కృష్ణారెడ్డి డిమాండ్‌చేశారు.సోమవారం ట్రిబుల్ ఆర్ భూ నిర్వాసితులకు న్యాయం చేయాలని డిమాండ్‌చేస్తూ ఆ సంఘం మండలకమిటీ ఆధ్వర్యంలో స్థానిక ఆర్డీఓ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ మండలంలో ట్రిబుల్ ఆర్‌లో భూమిని కోల్పోతున్న ఎక్కువ మంది సన్న, చిన్నకారు రైతులే ఉన్నారన్నారు.ఎకరం, రెండు ఎకరాల భూమిని సాగుచేస్తున్న రైతులు పూర్తిగా భూమిని కోల్పోవడం జరుగుతుందన్నారు.అనంతరం ఆర్డీఓ సూరజ్‌కుమార్‌కు వినతిపత్రం అందజేశారు.ఈ కార్యక్రమంలో ఎంపీటీసీలు తడక పారిజాత, చెన్నబోయిన వెంకటేశం, సర్పంచ్ బూర్గు చంద్రకళ, నాయకులు బోరెం ప్రకాశ్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, తడక మోహన్, సప్పిడి భూపాల్‌రెడ్డి, శేఖర్, వెల్గ శ్రీధర్‌రెడ్డి, బాలకృష్ణారెడ్డి, జనార్థన్‌రెడ్డి, నర్సింహారెడ్డి, రవీందర్‌రెడ్డి, సత్తిరెడ్డి, శంకర్‌రెడ్డి, గంగదేవి నర్సింహ, రఘునందన్‌రెడ్డి, కృష్ణారెడ్డి పాల్గొన్నారు.