Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వికలాంగుల హక్కుల జాతీయ వేదిక జిల్లా ప్రధాన కార్యదర్శి వనం ఉపేందర్
భూదాన్‌పోచంపల్లి:40 శాతం అంగవైకల్యం కలిగిన వికలాంగులు ఆహార భద్రత కార్డు పొందేందుకు అర్హులని జూలై 4న ౌరసరఫరాల శాఖ జీవో నెంబర్ 13 ను విడుదల చేసిందని జిల్లా కార్యదర్శి ఉపేందర్అన్నారు సోమవారం మండలపరిధిలో పెద్ద రావులపల్లె గ్రామపంచాయతీలో ఏర్పాటుచేసిన వికలాంగుల సమావేశంలో ఆయన మాట్లాడారు.జీవో వచ్చి రెండు నెలలు గడుస్తున్నా ఇప్పటివరకు ఎక్కడ కూడా వికలాంగులకు ప్రత్యేక రేషన్ కార్డులు ఇవ్వలేదన్నారు.ప్రభుత్వం నిర్మిస్తున్న డబుల్‌బెడ్ రూమ్ ఇండ్లలో వికలాంగులకు ఎక్కడ కూడా 5శాతం వాటా ఇవ్వడం లేదన్నారు.డబుల్ బెడ్రూమ్ ఇండ్లలో వికలాంగులకు వాటా ఇవ్వకుంటే కట్టిన డబుల్ బెడ్ రూమ్‌లను ఆక్రమించుకుంటామని హెచ్చరించారు.వికలాంగుల పట్ల సమాజంలో చిన్న చూపు ఏర్పడుతుందని, అంగవైకల్యం పేరుతో సంబోధిస్తూ వికలాంగుల అవమాన పరుస్తున్నారన్నారు.అనంతరం పెద్దరావుల పెల్లి గ్రామకమిటీని ఎన్నుకున్నారు.గౌరవ అధ్యక్షులు మెరుగు ఆంజనేయులు, అధ్యక్షులుగా గుండె శ్రీను,ఉపాధ్యక్షులుగా చుక్క బాలరాజ్,ప్రధాన కార్యదర్శిగా గ్యార పరమేష్, సహాయక కార్యదర్శిగా పూల నారాయణ, కోశాధికారి దోర్నాల పారిజాత,కమిటీ సభ్యులుగా పూల సత్తయ్య ధార ఉప్పలయ్య,సంగంస్వామి,బెజ్జం లింగస్వామి, సంఘం సుధాకర్,మరిపాల ఐలమ్మ,మాటూరి శకుంతల, సేగూరి పద్మ,బడే పద్మ,మరిపాల బుచ్చయ్య, పూలనర్సింహ, గుండె పోచమ్మ ఎన్నికయ్యారు.ఈ కార్యక్రమంలో ఎన్పీఆర్డీ జిల్లా కమిటీ సభ్యులు సంజీవ, శంకర్ పాల్గొన్నారు.