Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చివ్వెంల :పాలకులు ప్రజల సమస్యలు పట్టించుకోకుండా గాలికి వదిలేశారని కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి కోటగోపి అన్నారు.ప్రజాసంఘాల పోరాట వేదిక ఆధ్వర్యంలో సోమవారం మండలపరిధిలోని కుడకుడలో ప్రజా సమస్యలపై సర్వే నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓట్ల కోసం ప్రజల వద్దకు వచ్చే వారు అధికారంలోకి వచ్చాక ప్రజలను విస్మరిస్తున్నారన్నారు.అర్హులైన వారికి పెన్షన్లు, ఇండ్లు, స్థలాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు.ఇంటి జాగాలు ఉన్నవారికి ఇంటి నిర్మాణానికి ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.మున్సిపాలిటీలో కలిసిన విలీన గ్రామాల్లో ప్రజలకు ఉపాధిపనులు కల్పించాలని కోరారు.కుడకుడ చుట్టూ ఉన్న ప్రభుత్వ భూములను ఆక్రమించుకున్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.ప్రజా సమస్యల పరిష్కారానికి ఈ నెల 23 వ తేదీన జరిగే కలెక్టరేట్ ధర్నా లో ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.ఈ సర్వేలో జీఎంపీఎస్ జిల్లా సహాయ కార్యదర్శి కంచుగట్ల శ్రీనివాస్, కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు ఉయ్యాల నగేష్, కెేవీపీఎస్ జిల్లా సహాయ కార్యదర్శి పిండిగ నాగమణి నాయకులు భిక్షం,లింగయ్య, రాములు,జయమ్మ, ప్రమీల, వెంకన్న,సోమమ్మ తదితరులు పాల్గొన్నారు.