Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చివ్వెంల
మండలపరిధిలోని తిరుమలగిరి (జి )గ్రామంలో రైతు వేదికలో నేషనల్ పంచాయతీ అవార్డ్స్ కొరకు తొమ్మిది థీమ్స్‌కు సంబంధించిన ఫామ్స్ నింపు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ హాజరయ్యారు.ఈ తొమ్మిది థీమ్స్‌కు సంబంధించిన జిల్లా అధికారులు,మండల స్థాయి అధికారులు,గ్రామస్థాయి అధికారులతో తిరుమలగిరి(జి ) గ్రామానికి సంబంధించి ఆయా 9 అంశాలలో సమాచార సేకరణ చేసి వారే స్వయంగా అట్టి దరఖాస్తు నింపారు.జిల్లాలోని అన్ని 475 గ్రామ పంచాయతీలలో కూడా పంచాయతీ కార్యదర్శులు చొరవ తీసుకొని సర్పంచుల ఆధ్వర్యంలో ఆయా లైన్ డిపార్ట్మెంట్ వారితో సమన్వయం చేసుకొని సమగ్రంగా సమాచారం సేకరించి ఫామ్స్‌లో జాగ్రత్తగా నింపి జిల్లా పంచాయతీ అవార్డుల కమిటీ ఆమోదం పొంది సకాలంలో ఆన్లైన్ చేయాలని ఆదేశించారు.ఈ లైన్ డిపార్ట్మెంట్స్ అధికారులందరూ తప్పనిసరిగా ఈ సమాచార సేకరణలో పంచాయతీ కార్యదర్శులకు సహకరించాలని ఆదేశించారు.అంతకుముందు తిరుమలగిరి గ్రామానికి చేరుకోగానే మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డినిధులతో సర్పంచ్ కంచర్ల నిర్మల గోవిందరెడ్డి గారు అభివద్ధి చేస్తున్న మినీట్యాంక్ బండ్ పనులను పరిశీలించి అభినందించారు.ఈ కార్యక్రమములో జెడ్పీ సీఈఓ సురేష్, డీపీఓ యాదయ్య, డీఏఓ రామారావు, డీఎంహెచ్ఓ కోటాచలం, ఐసీడీఎస్ పీడీ జ్యోతిపద్మ, మండల ప్రత్యేక అధికారి వెంకటేశ్వర్లు,జిల్లా సివిల్ సప్లైస్ అధికారి పుల్లయ్య, ఏపీడీ పెంటయ్య, డీఎల్పీఓ లక్ష్మీనారాయణ, తహసీల్దార్ రంగారావు,ఎంపీడీఓ లక్ష్మీ, సర్పంచ్ కంచర్ల నిర్మలగోవిందరెడ్డి, ఎంపీఓ గోపి, ఏపీఓ నాగయ్య, ఏవో ఆశాకుమారి.