Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-యాదగిరిగుట్ట
ట్రాన్స్పోర్ట్ వర్కర్స్కు సంక్షేమబోర్డు ఏర్పాటు చేయాలని ఏఐఆర్టీడబ్యుఏఫ్ రాష్ట కార్యదర్శి పుప్పాల శ్రీకాంత్ డిమాండ్ చేశారు.రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ యూనియన్ యాదాద్రి భువనగిరి జిల్లా 2వ మహాసభ పట్టణంలోని లక్ష్మీనర్సింహాస్వామి ఫంక్షన్హాల్లో జిల్లా అధ్యక్షుడు ఎండి.పాషా అధ్యక్షతన నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో పద్నాలుగు లక్షలకుపైగా డ్రైవర్స్ ఉన్నారని,వీరు ప్రయాణీకులను, సరుకులను రవాణా చేయడం ద్వారా ఉపాధి పొందుతున్నారన్నారు.డ్రైవర్ అనేవ్యక్తి ఈ రోజున తన విధుల్ని నిర్వహించకపోతే గ్రామాలలో ఉత్పత్తి అయిన ఆహారధాన్యాలు పట్టణాలకు చేరవని, పట్టణాలలో ఉత్పత్తి అవుతున్న వినియోగవస్తువులు గ్రామాలకు చేరవన్నారు.ఇంత కీలకమైన పాత్ర నిర్వహిస్తూ డ్రైవర్ సమాజానికి తన వంతు సేవల్ని, ప్రభుత్వానికి ఆదాయాన్ని అందిస్తున్నాడు. కాని ప్రభుత్వాలు డ్రైవర్స్‌ని మొదట్నుంచి చులకనగా చూడడం నిర్లక్ష్యంచేశారని ఫలితంగా వీరికి స్వాతంత్ర మొచ్చి 75 ఏండ్లవుతున్నా ఎటువంటి జీవన భద్రతకి, రక్షణకు, సంక్షేమానికి నోచుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. డ్రైవర్ పరిస్థితి దినదినగండం నూరేండ్ల ఆయుష్సుల ఉందన్నారు.ఒక ప్రభుత్వ ఉద్యోగి, లేదా ఏదైనా ప్రైవేట్ జాబ్‌చేసే వారికైనా కనీస భద్రత ఉందని, జీతాలు ఉన్నాయి..లీవులు ఉన్నాయన్నారు. ఏదైనా రోగమొస్తే చూయించుకోవడానికి ఈఎస్ఐ ఉందన్నారు.ఈ మహాసభలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి దాసరి పాండు, ఫెడరేషన్ జిల్లా కార్యదర్శి కల్లూరి మల్లేశం, నాయకులు బబ్బురిపోశెట్టి, పోతరాజు జహంగీర్,సయ్యర్ ఉమర్జీ, యాదగిరి, గుండాల భిక్షం, నర్సింహ, నానచందు రమేష్,మన్సుర్ పాషా, జాని, కోళ్ళపాటి శ్రీను,గ్యార సురేష్, శ్రీనివాస్‌రెడ్డి, పాల్గొన్నారు. మహాసభలో రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు నక్కల యాదవరెడ్డి,పీఎన్ఎం జిల్లా కార్యదర్శి ముత్యాలు పాల్గొని సౌహార్థ సందేమిచ్చారు.