Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సదరం సర్టిఫికెట్ జారీ చేసిన తేదీ అ నుండి పెన్షన్ మంజూరు చేయాలి
- ఎన్పీఆర్డీ రాష్ట్ర కార్యదర్శి అడివయ్య
నవతెలంగాణ-భువనగిరి
వికలాంగుల పెన్షన్ 10వేలకు పెంపు, ఉచిత విద్యుత్ సాధన కోసం రాష్ట్రవ్యాపితగా ఉద్యమాలు చేస్తామని ఎన్పీఆర్డీ రాష్ట్ర కార్యదర్శి ఎం.అడివయ్య అన్నారు.మంగళవారం భువనగిరి పట్టణ జనరల్‌బాడీ సమావేశం పట్టణంలోని ఆర్బీనగర్లో కొత్త లలిత అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో 20 లక్షల మంది వికలాంగులు ఉన్నారని, వీరిలో కేవలం 4.83 లక్షల మందికి మాత్రమే పెన్షన్లు ఇస్తున్నారన్నారు.ధరల పెరుగుదలకు అనుగుణంగా వికలాంగుల పెన్షన్ 10వేలకు పెంచాలని డిమాండ్ చేశారు.కాలపరిమితి ముగిసిన వికలాంగులకు సర్టిఫికేట్ పొందినప్పటి నుండి ఎరియర్స్ చెల్లించాలని డిమాండ్ చేశారు.అదేవిదంగా సదరం సర్టిఫికెట్ జారీ చేసిన తేదీ నుండి పెన్షన్ మంజూరి చేసే విదంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ, రజకులకు ఉచిత విద్యుత్ ఇస్తున్న ప్రభుత్వం వికలాంగులకు ఎందుకు ఇవ్వడం లేదన్నారు. వికలాంగులకు ఉచిత విద్యుత్ పథకం సాధన కోసం ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. గడిచిన 8ఎండ్ల కాలంలో 12లక్షల ఆసరా పింఛన్లు రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసినారు. తక్షణమే ప్రభుత్వం రద్దు చేసిన ఆసరా పింఛన్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో రేషన్ కార్డు లేని ప్రతి వికలాంగులకు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న వికలాంగుల కోసం ప్రతి జిల్లా కేంద్రంలో వికలాంగుల స్టడీ సర్కిల్ ఎర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. 21రకాల వైకల్యాల వారికి వైకల్య ధవీకరణ పత్రాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శాఖలలో ఖాళీగా ఉన్న బ్యాక్ లాక్ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేట్ పరం చేయడం వల్ల వికలాంగులు రిజర్వేషన్స్ దక్కకుండా పోతాయని అన్నారు. రిజర్వేషన్ల పరిరక్షణ కోసం ఉద్యమం చేస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర సహాయ కార్యదర్శి వణం ఉపేందర్, రాష్ట్ర కమిటీ సభ్యులు బొల్లేపల్లి స్వామి, రాష్ట్ర సాంస్కృతిక విభాగం నాయ కులు కటకమోజు అంజన్ శ్రీ,6 వార్డు అధ్యక్షులు కాలమంచి స్వరుప ఉపాధ్యక్షులు గీస గీతా ప్రధాన కార్యదర్శి ఉడుత మలేశం సహాయక కార్యదర్శి మొతె పద్మ కోశాధికారి మజ్జిగ శివలక్ష్మి ఇండ్ల సుగుణ అందె శంకరమ్మ అందె వేణు పాల్గొన్నారు.