Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-తిరుమలగిరి సాగర్
పోషకాహారంతోనే సంపూర్ణ ఆరోగ్యం అని ఐసీడీఎస్ సీడీపీవో గందం పద్మావతి అన్నారు. మంగళవారం మండలంలోని నెల్లికల్ అంగన్వాడీ రెండవ సెంటర్లో పోషణ మాసం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గర్భిణులు, బాలింతలు పోషకాహారం భుజించాలన్నారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ పోషకాలు గల పోషకాహారం గురించి వివరించారు. రక్త హీనత, ఫౌష్టికాహర లోపం, తల్లిపాల ప్రాముఖ్యత, ఇతర అంశాలపై మహిళల్లో అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్లు విజయ లక్ష్మి, వెంకాయమ్మ, ఉపాధ్యాయులు కష్ణవేణి , సుహాసిని, న్యాట్కో ట్రస్ట్ సిబ్బంది రాంబాబు, రావు, అంగన్వాడీ టీచర్లు శ్రీదేవి, రమాదేవి, నాగేశ్వరి, తదితరులు పాల్గొన్నారు.