Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చండూర్
స్థానిక సత్య ఐటీఐ కళాశాలలో చదివిన విద్యార్థులకు లైన్మెన్ వేణు చేతుల మీదుగా ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు మంగళవారం ధ్రువ పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సత్య ఐటీఐలో చదివి ఎంతో మంది గవర్నమెంట్ జాబ్స్ పొంది, లైన్మెన్లుగా, సబ్ స్టేషన్ ఆపరేటర్‌గా ఉపాధి అవకాశాలు పొందారన్నారని, ఉన్నత స్థాయికి చేరాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ చంద్ర శేఖర్, కృష్ణవేణి స్కూల్ ప్రిన్సిపాల్ వైస్ ప్రిన్సిపల్ రాజు, విజరు కుమార్, విద్యార్ధులు పాల్గొన్నారు.