Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఫర్టిలైజరు, పెస్టిసైడ్స్ యజమానిపై పోలీస్స్టేషన్లో బాధితరైతు ఫిర్యాదు
నవతెలంగాణ-చింతపల్లి
మండలంలోని మాల్ వీటీనగర్ గొడుకొండ్లలోని శ్రీ కన్యకా పరమేశ్వరి ఫర్టిలైజర్ అండ్ పెస్టిసైడ్స్ అండ్ సీడ్స్ షాపులో కడారి సరిత మహిళ రైతు 1350 రూపాయలు పెట్టి గడ్డి మందు కొనుగోలు చేసింది.తన 1.20 ఎకరాల పత్తిచేనులో ఈ మందును పిచికారీ చేయగా చేనంతా మాడిపోయింది. ఈవిషయమై తాను షాపు యజమానిని అడుగగా 'నాకేమీ తెలియదని..ఎక్కువగా మాట్లాడితే కేసు పెడ్తానని' అని బెదిరిస్తున్నాడని బాధితురాలు వాపోయింది.వెంటనే గడ్డిమందు డబ్బాను తీసుకెళ్లి మండలవ్యవసాయ అధికారికి చూపించగా ఈ విషయంపై ఎంక్వయిరీ చేసి విచారిస్తామని ఆమెకు భరోసా కల్పించారు.అనంతరం ఆమె శ్రీ కన్యకా పరమేశ్వరి ఫర్టిలైజర్ ఓనర్ అయిన ఆనంద్ కిరణ్ పై చట్టరీత్యా చర్య తీసుకోవాలని స్థానిక పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది.తనకున్న ఎకరంన్నరభూమిలో వేసుకున్న పంటంతా మాడిపోయిందని..దీంతో తమ కుటుంబం రోడ్డునపడుతుందని కన్నీరుమున్నీరైంది.వెంటనే షాపు యజమాని నుండి తనకు నష్టపరిహారం ఇప్పించాలని వేడుకుంది.