Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మునుగోడు
అట్టడుగు ప్రజలు ఆర్థికంగా ఎదిగినప్పుడే అన్ని రంగాలలో రన్నించగలుగుతారని భువనగిరి మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్ అన్నారు. మంగళవారం మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన గౌడ కమ్యూనిటీ హాల్‌ను ప్రారంభించి మండల గౌడ సభ్యులకు బీహార్ నుంచి తన సొంత ఖర్చులతో తెచ్చిన తాటి పొట్టి విత్తనాలను ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ తెలంగాణలో గీత వత్తిదారుల కోసం బీహార్ నుంచి 30 వేల తాటి పొట్టి విత్తనాలను తీసుకొచ్చి పంపిణీ చేస్తున్నారన్నారు. మరో 30 వేల తాటి విత్తనాలను పెంచి త్వరలో మొక్కలను పంపిణీ చేస్తామన్నారు. కులవత్తితోపాటు ప్రతి ఒక్కరూ రాజకీయంగా ఎదగాలన్నారు. గీత బంధు కోసం కలిసికట్టుగా కొట్లాడుతామని తెలిపారు. మునుగోడు మండ లంలో 5వేలు తాటి పొట్టి విత్తనాలు పంపిణీ చేశామన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కర్నాటి విద్యాసాగర్, మాజీ జెడ్పిటిసి జాజుల అంజయ్యగౌడ్, మాజీ ఎంపీపీ పోలగోని సత్యం, ఎంపీటీసీలు శ్రావణి నాగరాజ్ గౌడ్, పోలగోని విజయలక్ష్మి సైదులుగౌడ్, అనంత వీణాస్వామిగౌడ్, సర్పంచులు నకరికంటి పద్మ యాదయ్య గౌడ్, పంతంగి పద్మ స్వామి గౌడ్, సురిగి చలపతి, జిల్లా నాయకులు పాలకురు యాదయ్య గౌడ్, కొండ వెంకన్న గౌడ్, తదితరులు పాల్గొన్నారు.