Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సంక్షేమపథకాలలో ప్రపంచంలోనే తెలంగాణ నెంబర్ వన్
- మునుగోడులో ఫ్లోరోసిస్‌ను పారదోలిన ఘనత కేసీఆర్‌దే
- రాష్ట్ర విద్యుత్తుశాఖ మంత్రి గుంతకండ్ల జగదీశ్‌రెడ్డి
నవతెలంగాణ-చౌటుప్పల్
భారతదేశం చూపు తెలంగాణ సీఎం కేసీఆర్ వైపు ఉందని రాష్ట్ర విద్యుత్ మంత్రి గుంతకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు.మంగళవారం పట్టణకేంద్రంలో టీఆర్ఎస్ కుటుంబసభ్యుల ఆత్మీయ సమ్మేళనం(వన భోజనాలు) నిర్వహించారు.ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో మంత్రి జగదీశ్‌రెడ్డి మాట్లాడారు. ప్రపంచంలో ఏ దేశం భారత్‌లో ఏ రాష్ట్రం అమలుచేయని సంక్షేమపథకాలను సీఎం కేసీఆర్ అమలుచేస్తున్నారని కొనియాడారు.దేశ ప్రజలు కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని తెలిపారు.దేశంలోనే సంక్షేమపథకాల అమలులో తెలంగాణ రాష్ట్రం నెంబర్ వన్‌గా నిలుస్తుందన్నారు.రూ.లక్ష కోట్లతో మూడేండ్లలో కాలేశ్వరం ప్రాజెక్టు నిర్మించిన ఘనత కేసీఆర్‌దేనన్నారు.ప్రపంచంలో జపాన్, చైనాలు కూడా ఇంత తొందరలో ఇంత పెద్ద ప్రాజెక్టు నిర్మించలేదన్నారు.60 ఏండ్లుగా ఫ్లోరోసిస్‌తో బాధపడుతున్న మునుగోడు ప్రజల బాధను ఆరేండ్లలోనే ప్లోరోసిస్‌ను పారదోలిన ఘనత కేసీర్దేనన్నారు.టీఆర్ఎస్ భ్యులంతా కుటుంబంలా భావించి ఆత్మీయ సమ్మేళనం, వనభోజనాలు నిర్వహించాలని కేసీఆర్ ఆదేశించడంతో ఈ కార్యక్రమం చేపట్టామని తెలిపారు.కులమతాలకతీతంగా పండుగ చేసుకోవాలనే ఉద్దేశంతో టీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం నిర్వహిస్తుందని పేర్కొన్నారు.దేశంలో ఎన్ని కొత్త పార్టీలు వచ్చినా ప్రజల గుండెల్లో నిలిచే పార్టీ టీఆర్ఎస్ అన్నారు.రైతుబంధు,దళితబంధు, గిరిజనబంధు, ఆసరా పింఛన్లు అందిస్తున్న ఘనత కేసీఆర్‌కే దక్కుతుందన్నారు.పేద ప్రజలకు అనేక సంక్షేమపథకాలు అందిస్తూ తండ్రిలాగా కేసీఆర్ నిలిచిపోతున్నారని పేర్కొన్నారు. దేశంలో కేవలం 8 ఏండ్లలో రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి చేసిన ఘనత కేసీఆర్‌దేనన్నారు.రాష్ట్రంలో నెలకొన్న దారిద్య్రాన్ని కేసీఆర్ తరిమికొట్టారన్నారు. తెలంగాణ అభివృద్ధే కేసీఆర్ ఏకైక లక్ష్యమన్నారు.రాష్ట్ర అభివృద్ధి కోసం అవిశ్రాంతంగా శ్రమిస్తున్న కేసీఆర్‌కు ప్రజలు అండగా నిలవాలని కోరారు. మునుగోడు గడ్డపై గులాబీ జెండా ఎగురవేయాలని పిలుపునిచ్చారు.
ఆకట్టుకున్న సాంస్కృతిక నృత్య కళారూపాలు
టీఆర్ఎస్ కుటుంబం ఆత్మీయ సమ్మేళనం సందర్భంగా ప్రదర్శించిన కళారూపాలు కార్యకర్తలను ఎంతో ఆకట్టుకున్నాయి.బోనాలతో మహిళలు సభాస్థలానికి తరలిరాగా మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి బోనమెత్తుకొని కార్యకర్తలను ఎంతో ఉత్సాహపరిచారు.బతుకమ్మ ఆడారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించే విధంగా నిర్వహించిన కళాకారుల ప్రదర్శనలు, ఆటపాటలు కార్యకర్తల్లో ఎంతో ఉత్తేజాన్ని నింపాయి.పదివేల మందికిపైగా వనభోజనాలు చేశారు.తెలంగాణ వంటకాలతో చేసిన భోజనాలతో కార్యకర్తలు సంతోషం వ్యక్తంచేశారు.ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్యయాదవ్, ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావు, ఎమ్మెల్యేలు ఎన్.భాస్కర్‌రావు, శానంపూడి సైదిరెడ్డి, బొల్లం మల్లయ్యయాదవ్, గాదరి కిశోర్, మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్, మున్సిపల్, మార్కెట్, సింగిల్‌విండో చైర్మెన్లు వెన్‌రెడ్డి రాజు, బొడ్డు శ్రీనివాస్‌రెడ్డి, చింతలదామోదర్రెడ్డి, టీఆర్ఎస్ మున్సిపాలిటీ, మండల అధ్యక్షులు ముత్యాలప్రభాకర్రెడ్డి, గిరికటి నిరంజన్‌గౌడ్, నాయకులు ఢిల్లీ మాధవరెడ్డి, ముప్పిడి శ్రీనివాస్‌గౌడ్, చెన్నగోని అంజయ్యగౌడ్, దేవరపల్లి గోవర్థన్‌రెడ్డి, అభినందన్‌రెడ్డి, ఉడుగు మల్లేశ్‌గౌడ్, గుండెబోయిన అయోధ్యయాదవ్, సిద్దిపేట శేఖర్‌రెడ్డి, తొర్పునూరి నర్సింహాగౌడ్, అల్మాసిపేట కృష్ణయ్య, కానుగుల వెంకటయ్య, బాలమణి, కప్పల శ్రీను, కౌన్సిలర్లు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, గ్రామశాఖల అధ్యక్షులు, మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.