Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-రామన్నపేట
రామన్నపేట గ్రామపంచాయతీ ఉపసర్పంచ్ పోడిశెట్టి కిషన్ గ్రామపంచాయతీ పరిపాలనలో అధికార, నిధులు దుర్వినియోగమునకు పాల్పడినందున ఉపసర్పంచ్ చెక్కు డ్రా చేయు అధికారాన్ని నిషేధిస్తూ కలెక్టర్ పమేలాసత్పతి ఉత్తర్వులు జారీ చేశారు.కలెక్టర్ (పం. విభాగం) యాదాద్రి భువనగిరి ఉత్తర్వుల ప్రకారం జిల్లాకలెక్టర్ పమేలా సత్పతి ఉత్తర్వు నెం.1486/2022-ఎ 15.09.2022 ప్రకారం గ్రామ పంచాయతీ రామన్నపేట వార్డు సభ్యులలో ఎవరైనా ఒక వార్డు సభ్యున్ని ఎన్నుకొని, గ్రామ పంచాయతీ తీర్మాణం చేసి అ తీర్మాణం ప్రతిని సమర్పించాలని ఉత్తర్వులో పేర్కొన్నారు.గ్రామపంచాయతీ నిధులలో సర్పంచ్ దుర్వినియోగం చేశారని జాయింట్ చెక్‌పవర్ ఉన్న ఉపసర్పంచ్ పోడిశెట్టి కిషన్ జులై 13న కలెక్టర్, జిల్లా పంచాయతీరాజ్ అధికారికి ఫిర్యాదు చేశారు. గ్రామపంచాయతీ నిధులు దుర్వినియోగం అయ్యాయని జూలై నెలలో గ్రామ ఉపసర్పంచ్ పొడిచేటి కిషన్, కొంతమంది వార్డు సభ్యులు కలిసి కలెక్టర్, జిల్లా పంచాయతీరాజ్ శాఖ అధికారికి ఫిర్యాదు చేశారు.అంతా బాగానే ఉంది కానీ, దుర్వినియోగమైన నిధుల డ్రాలో సర్పంచ్‌తో పాటు ఉపసర్పంచ్‌కు కూడా జాయింట్ చెక్‌పవర్ ఉందన్న విషయాన్ని మర్చిపోయారో లేక సర్పంచ్‌ను పూర్తి బాధ్యుని చేయాలని భావించాడో... తెలియదు కానీ, కొన నాలికకు మందిస్తే ఉన్న నాలిక ఊడినట్లయిందని, చెరపుకురా!చెడేవు!... అంటే ఇదేనేమో అని రామన్నపేట పట్టణ ప్రజలు మంగళవారం వాట్సాప్‌లో చక్కర్లు కొడుతున్న ఉపసర్పంచ్ చెక్ పవర్ రద్దు అని విషయాన్ని తెలుసుకొని చర్చించుకుంటున్నారు. పది రోజుల కింద రామన్నపేట సర్పంచ్ శిరీష చెక్ పవర్ రద్దు అని జిల్లాకేంద్రంలో కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేసిన వెంటనే స్థానిక ఎంపీడీవో మండలంలోని అనేక వాట్సాప్ గ్రూపులో దాన్ని పోస్ట్ చేశారు బాగానే ఉంది కానీ ఉపసర్పంచ్ పొడిచేటి కిషన చెక్‌పవర్ రద్దు చేసినట్లు ఈనెల 15న ఉత్తర్వులు వెలువడిన నేటి వరకు సంబంధిత అధికారులకు ఆ ప్రతిని ఇవ్వకపోవడం చూస్తూ ఉంటే మండల పరిషత్ అధికారుల్లో ప్రజాప్రతినిధుల పట్ల ఎంత వైషమ్యంగా వ్యవహరిస్తున్నారో గమనించవచ్చు. కొందర్ని భుజానమస్తు మరికొందర్ని కాళ్ల కింద తొక్కేసినట్టుగా వ్యవహరించడం తగదని మండల ప్రజలు చర్చించుకుంటున్నారు.