Authorization
Mon Jan 19, 2015 06:51 pm
భువనగిరి: భారత కరెన్సీ నోట్లపై అంబేద్కర్ఫొటోను ముద్రించే విధంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని తుర్కపల్లి ఎంపీపీ భూక్యా సుశీలరవినాయక్ డిమాండ్ చేశారు.మంగళవారం స్థానిక అంబేద్కర్ విగ్రహానికి కు జ్ఞానమాల (92వ వారం) సమర్పించారు. కరెన్సీ నోట్లపై అంబేద్కర్ సాధన సమితి జాతీయ అధ్యక్షులు డాక్టర్ జేరిపోతుల పరుశురాం మాట్లాడుతూ మన సంస్కతి, మన పండుగ సబ్బండ కులాల బహుజన బతుకమ్మ, బహుజన దుంధాం విమలక్క ఆధ్వర్యంలో గుండాల మండలం వెల్మజాలలో ఈ నెల 30న నిర్వహిస్తామన్నారు. అనంతరం ఆయన, తుర్కపల్లి మండల పరిషత్ అధ్యక్షులు భుక్యా సుశీలతో కలిసి బహుజన బతుకమ్మ పోస్టర్ ను ఆవిష్కరించారు.దళిత బహుజన గిరిజన సంఘాలు, రాజకీయ పార్టీల అధ్యక్షులు,పజాప్రతినిధులు సబ్బండ కులాలు పాల్గొనాలని కోరారు.నూతన పార్లమెంట్ భవన్కు అంబేద్కర్ పేరు పెట్టాలని అసెంబ్లీ లో తీర్మానం చేయడం, తెలంగాణ సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టడం హర్షనీమన్నారు.ఈ కార్యక్రమంలో కరెన్సీ నోట్లపై అంబేద్కర్ ఫొటో సాధన సమితి జిల్లా చైర్మెన్ కొడారి వెంకటేష్, గౌరవ అధ్యక్షులు బట్టు రాంచంద్రయ్య,బర్రె సుదర్శన్, రాసమల్ల సుదర్శన్,బానోత్ భాస్కర్నాయక్, బానోతు రాజేష్నాయక్, ధరణికోట నర్సింహ, రావులరాజు, జాగిల్లాపురం ఐలయ్య బండారు శివశంకర్, హమీద్పాషా, భూతంయాదగిరి,ధరావత్ హరినాయక్, పాల్గొన్నారు.