Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏండ్లు గడుస్తున్నా ప్రారంభానికి నోచని వైనం
- పట్టించుకోని అధికారులు
నవతెలంగాణ-కోదాడరూరల్
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా డబుల్‌బెడ్ రూమ్ ఇండ్లు నిర్మించి ఏండ్లవుతున్నా ప్రారంభించకపోవడంతో శిథిలావస్థకు చేేరాయి.మండలపరిధిలోని బీక్యాతండా గ్రామంలో పేదలకోసం 100 ఇండ్లు నిర్మించాలనే ఉద్దేశంతో మొదటి విడతగా 50 ఇండ్లను ప్రభుత్వం నిర్మించింది. కానీ కాంట్రాక్టర్లు నాణ్యతాప్రమాణాలు పాటించకుండా నిర్మాణం చేపట్టడంతో స్లాబుపై పగుళ్లు వచ్చి పెచ్చులూడుతున్నాయి.ఇండ్లకు వేసిన రంగు కూడా మారింది అని, ఇంతవరకు విద్యుత్లైన్లు ఏర్పాటు చేయలేదని, మరుగుదొడ్ల నిర్మాణానికి తీసిన గుంతలు శిధిలావస్థకు చేరాయని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. అంతే కాకుండా ఇప్పటివరకు మంచినీటి సౌకర్యం కల్పించలేదని పేర్కొంటున్నారు.అధికారులు లబ్దిదారులను ఎంపిక చేసినా కూడా డబుల్‌బెడ్ రూమ్ ఇండ్లను ప్రారంభించకపోవడం ఏంటని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు.గ్రామంలో ఇండ్లు లేక అనేక మంది ఇబ్బంది పడుతున్నామని ఉన్న ఇండ్లు వర్షానికి కురుస్తున్నాయని ఏమి చేయాలో పాలుపోక కొంతమంది డబల్ బెడ్ రూమ్ ఇండ్లలో వచ్చి ఉంటున్నారు. కానీ ఎటువంటి సౌకర్యాలు అధికారులు కల్పించకపోవడంతో అనేక ఇబ్బందులు పడుతున్నారు. కోట్ల రూపాయలు వెచ్చించి బూడిదలో పోసినట్లుగా ఇండ్లను నిర్మించారని పలువురు వాపోతున్నారు. ఇండ్ల నిర్మాణానికి చాలావరకు డస్ట్‌ను ఎక్కువగా వాడారని,ఇప్పటికే ఇవి నిర్మించి ఐదేండ్లు కావొస్తున్నా మరొక ఐదేండ్లలో ఇండ్లు పూర్తిగా శిథిలావస్థకు చేరుతాయని గ్రామస్తులు తెలుపుతున్నారు.అంతేకాకుండా మిగతా 50 ఇండ్లను కూడా త్వరగా పూర్తి చేయాలని కోరుతున్నారు.ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి నిర్మించిన ఇండ్లను త్వరగా పంపిణీ చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.
లబ్దిదారుల ఎంపిక ఇంకా పూర్తికాలేదు : ఏఈ రాము
మండలపరిధిలోని బీక్యాతండా గ్రామంలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కోసం లబ్దిదారుల ఎంపికి ఇంకా పూర్తికాలేదు.వారంలో డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు మంచినీరు, విద్యుత్ సౌకర్యం కల్పిస్తాం.ఇంకా కొన్ని పనులు పూర్తి చేయాల్సి ఉంది.