Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చివ్వెంల
కల్లుగీత కార్పొరేషన్‌కు ప్రభుత్వం బడ్జెట్లో రూ.5 వేల కోట్లను కేటాయించాలని తెలంగాణ కల్లుగీతకార్మికసంఘం జిల్లా ప్రధానకార్యదర్శి బెల్లంకొండవెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు.మంగళవారం మండలకేంద్రంలో నిర్వహించిన ఆ సంఘం మండల మహాసభలనుద్దేశించి ఆయన మాట్లా డారు. ప్రతి సొసైటీకి ఐదెకరాల భూమి ఇవ్వాలని, జీఓ 560ను అమలు చేయాలి లేదా కొనివ్వాలని కోరారు.తాటి,ఈత చెట్లను నరికిన వారిపై కఠినచర్యలు తీసుకునే విధంగా కొత్తచట్టం తీసుకు రావాలని డిమాండ్ చేశారు. ప్రమాదానికి గురై చనిపోయిన వారి కుటుంబాలకు, శాశ్వత వికలాంగులకు రూ.10 లక్షలు, తాత్కాలిక వికలాంగులకు రూ.లక్ష చొప్పున ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు.మెడికల్ బోర్డు విధానం తొలగించాలని, చనిపోయిన వారి పిల్లలకు ఉచితవిద్య కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని కోరారు.కొత్త గ్రామ పంచాయతీలలో గీత కార్మికులు ఉన్నచోట సొసైటీలకు అవకాశం కల్పించాలన్నారు. ఈనెల 29వ తేదీ ఆత్మకూరుఎస్ మండలం నెమ్మికల్‌లో(దండుమైసమ్మ) శుభంఫంక్షన్హాల్లో జిల్లా మహాసభలు ఉంటాయని, సభలను జయప్రదం చేయాలని కోరారు. అక్టోబర్ 19, 20వ తేదీల్లో యాదగిరిగుట్ట పట్టణంలో రాష్ట్ర 3 వ మహాసభలు ఉంటాయన్నారు.ఈ కార్యక్రమంలో ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు ఎలుగూరి గోవింద్, ఉయ్యాలనగేష్, మడ్డి అంజిబాబు, జెర్రిపోతుల కష్ణ, పిచ్చయ్య, కలగాని సోమయ్య,శిగనరసయ్య, పబ్బు నాగయ్య, పబ్బు జానయ్య, నోములవెంకన్న పాల్గొన్నారు.
మండల కమిటీ ఎన్నిక...
మండలగైడర్గా ఉయ్యాలనగేష్, మండల గౌరవ అధ్యక్షునిగా కలగాని సోమయ్య. సిగ సైదులు. బెల్లంకొండ హనుమంతు, అధ్యక్షునిగా దోనేటి పిచ్చయ్య, ప్రధాన కార్యదర్శిగా జెర్రిపోతుల కృష్ణ, ఉపాధ్యక్షులుగా శిగ నర్సయ్య, బూరశేఖర్, బుడిగ సైదులు,పబ్బు జానయ్య, సహాయకార్యదర్శులుగా సురభి సతీష్ (సోషల్ మీడియా) శిగ రవి, అమరగాని వీరయ్య, శిగ పిచ్చయ్య ఎన్నికయ్యారు.