Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మునగాల
పత్తి పంటల సాగు సస్యరక్షణ చర్యలపై మంగళవారం మండంలోని నర్సింహులగూడెంలో వ్యవసాయ శాఖ బాయిర్ క్రాప్ సైన్స్ కంపెనీ ఆధ్వర్యంలో రైతులకు అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా మండల వ్యవసాయఅధికారి బాణోత్ అనిల్‌కుమార్ మాట్లాడారు.పంటలపై గులాబీరంగు పురుగు పచ్చదోమ,పేనుబంక, లద్దెపరుగు ఆశించి ందన్నారు.పురుగు నివారణకు కోసం లింగాకర్షక బుట్టలు అమర్చాలని చెప్పారు.ఇంకా వేపనూనే 5 మి.లీ (1500 పి పి ఎమ్) లేదా ఫ్లోనికామిడ్. 0.3 గ్రా. లేదా తయోమితాక్సిమ్ 0.2 గ్రా., పెనుబంకకు ఏసిపేట్ 1.5 గ్రా. లేదా ఏసీటామిప్రిడ్ 0.2 గ్రా. లేదా మోనోక్రోటోఫాస్ 1.6 మి.లీ. లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలని సూచించారు.లద్దెపురుగు పురుగు నివారణకు ఇమామెక్టిన్ బెంజోఏట్ 0.5 గ్రాములు, లేదా స్పినోసాడ్ 0.3 మి.లీ.ద్రావణాన్ని లీటరు నీటికి కలిపి స్ప్రే చేయాలన్నా రు.బాయిర్ కంపెనీ మేనేజర్ డి.లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ఈ సమ యంలో పత్తి పంటలపై గులాబీరంగు పురుగువచ్చే అవకాశం ఉన్నదని తెలిపారు.రైతులు విత్తిన 45 రోజుల నుండి గులాబీరంగు పురుగు ఉనికిని గమనించి లింగాకర్షక కోసం బుట్టలు అమర్చాలన్నారు.పురుగునివారణకు ప్రొఫెనోఫాస్ 2 మి.లీ. లేదా క్లోరోపైరిఫాస్ 2.5 మి.లీ లేదాఇమామెక్టిన్ బెంజోఏట్ 0.5 గ్రా లేదా.స్పైనోసాడ్ 0.3 మిలీ లేదా. క్వినాలోఫాస్ 2 మి.లీ లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలన్నారు.ఈ కార్యక్రమంలో కంపెనీ మేనేజర్ లక్ష్మీ నారాయణ,వ్యవసాయ విస్తరణ అధికారి నాగు,రైతు బండారు వెంకటేశ్వర్లు, పాల్గొన్నారు.