Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నేరేడుచర్ల
గరిడేపల్లి మండలంలోని అబ్బిరెడ్డిగూడెం గ్రామంలో సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో ప్రజా సమస్యలపై ఇంటింటి సర్వే చేపట్టారు.మంగళవారం ఆ పార్టీ ఆధ్వర్యంలో గ్రామంలో నెలకొన్న ప్రజా సమస్యలైన ఇండ్లస్థలాలు, రేషన్‌కార్డులు, వివిధ రకాల పెన్షన్లు, పలు సమస్యలపై సర్వే చేస్తూ రేపు తహసీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు ఇవ్వనున్నట్టు సీపీఐ(ఎం) మండల కార్యదర్శియాకుబ్ అన్నారు.కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా సమస్యల విషయంలో పక్కకు పెట్టి కేవలం మునుగోడు చుట్టూ తిరుగుతు న్నారన్నారు.ప్రతి పేదవాడికి డబుల్ బెడ్ రూమ్ ఇస్తానని చెప్పి 8 ఏండ్లవుతున్నా ఇంతవరకు ఇవ్వలేదని , అర్హులందరికీ ఇండ్లస్థలాలు, రేషన్‌కార్డులు,పెన్షన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు.8400 మంది పెన్షన్ల కోసం దరఖాస్తు చేయగా కేవలం 2వేలమందికి మంజూరు చేశార న్నారు.6400 మంది దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన మాట తప్పకుండా దరఖాస్తు చేసుకున్న పేదలందరికీ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో ఎస్కె.హుస్సేన్,జి.పెంటయ్య,వడ్డేపూడి పద్మ, సుమలత, ఎస్కె.బీబులు, సుందరమ్మ, రత్నం, బి.రమేశ్, ఎస్కె.లాలు, యాదాద్రి, రాధిక,కిరణ్, పి.రామయ్య పాల్గొన్నారు.