Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు సుధాకర్‌రెడ్డి
నవతెలంగాణ-నల్లగొండ
వ్యవసాయ రంగాన్ని మోడీ ఆగంబట్టిస్తుండని, ఈ దేశంలో మోడి అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యవసాయరంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసే కుట్రకు పూనుకున్నారని రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి అన్నారు. తెలంగాణ రైతు సంఘం కనగల్ మండల మహాసభ బ్రహ్మానందరెడ్డి అధ్యక్షతన కనగల్ ఎక్స్ రోడ్లో నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ దేశవ్యాప్తంగా వ్యవసాయాన్ని ఆగం చేయడానికి మూడు నల్ల చట్టాలను తీసుకొచ్చి రైతన్న పోరాటానికి తలొగ్గి కేంద్ర ప్రభుత్వం తోక ముడిచిందన్నారు. ఈ దేశానికి బుక్కెడు బువ్వ పెడుతున్న రైతులకు సాయం చేయాల్సింది పోయి కార్పొరేట్ శక్తుల అండదండలతో అనేక ఇబ్బందులు సష్టిస్తున్నారన్నారు. రైతులకు అందించే ఎరువుల విషయంలో కావొచ్చు, పరికరాల విషయంలో కావొచ్చు..ఎక్కడ కూడా సబ్సిడీ ఇవ్వకుండా, రైతు పండించిన పంటలను కొనకుండా, లాభసాటి ధర నిర్ణయించకుండా వ్యవసాయానికి వెన్నుపోటు పొడుస్తున్నారన్నారు. మొత్తంగా వ్యవసాయాన్ని కార్పొరేట్ శక్తులకు అంచలంచెలుగా అప్పగిస్తున్నాడని ఈ దేశ వ్యవసాయానికి బిజెపి నుంచి ప్రమాదం పొంచి ఉందని దీనిని సమిష్టిగా ఎదుర్కోవాల్సిన బాధ్యత రైతాంగం పైన ఉందని తెలిపారు. కేంద్రం నుండి రైతాంగానికి కనీస సహాయం లేదన్నారు. ఈ కార్యక్రమంలో ఐద్వా జిల్లా కార్యదర్శి పాలడుగు ప్రభావతి, సీపీఐ(ఎం) మండల కార్యదర్శి కందుల సైదులు సుల్తానా, గుణాల పూరి మారయ్య, రామ్ రెడ్డి గోపాల్ రెడ్డి, చెరుకుపల్లి సత్తయ్య, కాసర్ల యాదగిరిరెడ్డి, పాలకూరి పార్వతమ్మ, రామలింగమ్మ, లక్ష్మమ్మ, జయమ్మ, వెంకటమ్మ, యాదమ్మ, చిట్టెమ్మ, తదితరులు పాల్గొన్నారు. అనంతరం కనగల్లు నూతన మండల కమిటీ ఎన్నిక జరిగింది. అధ్యక్షులుగా గుణాల పూరి మారయ్య, కార్యదర్శిగా బ్రహ్మానందరెడ్డి, మరో పదిహేను మందితో కమిటీ ఎన్నుకున్నారు.