Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎడమ కాలువ పనులను పరిశీలించిన మంత్రి జగదీశ్‌రెడ్డి
నవతెలంగాణ-నిడమనూరు
రైతులకు ఇబ్బంది కలగకుండా ఒక్క ఎకరం పొలం నష్టపోకుండా ఉండడం కోసమే ముఖ్యమంత్రి ఆదేశాలు మేరకు యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టి నాగార్జునసాగర్ ఎడమ కాలువకు నీటిని వదిలామని విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. మంగళవారం మండల పరిధిలోనీ వెంపాడ్ వద్ద జరిగిన సాగర్ ఎడమ కాలువ పనులనూ అయాన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రమాదం కాల్వ అంచులు కాకుండా కాల్వ మధ్యలో గండి పడడం టెక్నికల్‌గా అంచనా వేయలేక పోయామని, కాలువ మధ్యలో సుడిగుండము ఏర్పడడం వలన ప్రమాదం జరగవచ్చని తెలిపారు. ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశాల మేరకు రైతుల బాధలను అర్దం చేసుకున్న ప్రభుత్వం యుద్ద ప్రాతిపదికన పనులు వేగంగా జరిగేలా చర్యలు తీసుకుందని పేర్కోన్నారు. మంగళవారం 2500 క్యూసెక్కుల నీటిని విడుదల చేసి మరో రెండు మూడు రోజులలో పూర్తిస్థాయిలో నీటిని విడుదల చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మేల్యేలు నోముల భగత్, హుజూర్ నగర్ శాసన సభ్యులు శాగం సైదిరెడ,ి్డ కోదాడ ఎమ్మేల్యే బోళ్ళం మల్లయ్య యాదవ్, జడ్పీ వైస్ చైర్మన్ ఇరిగి, సీనియర్ నాయకులు హనుమంతరావు, ఎంపీపీ బొల్లం జయమ్మ, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు అంకతి వెంకటరమణ, పిఎసిఎస్ చైర్మన్ గుంటుక వెంకట్‌రెడ్డి, మండల అధ్యక్షులు తాటి సత్యపాల్, తదితరులు పాల్గొన్నారు.