Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నల్లగొండ కలెక్టరేట్
అక్టోబర్ 16 న జరుగనున్న గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షకు అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ టి.వినరు కృష్ణారెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో గ్రూప్ 1 పరీక్ష కేంద్రాలుగా గుర్తించిన పాఠశాల, కళాశాల యాజమాన్యాలు, ప్రిన్సిపాల్స్లతో, డిఈఓ, జిల్లా ఇంటర్మీడియట్ విద్య అధికారులతో సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు. జిల్లా కేంద్రంలో గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష కేంద్రాలుగా గుర్తించిన 49 ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలల యాజమాన్యాలు విద్యార్థులు పరీక్ష రాసేందుకు అవసరమైన సౌకర్యాలు కల్పించాలని సూచించారు. జిల్లాలో 16,088 మంది పరీక్షకు హాజరు కానున్నారని వెల్లడించారు. అదే విధంగా పరీక్ష జరిగే గదులలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని తెలిపారు. కళాశాల, పాఠశాల వారీగా ప్రస్తుతం ఉన్న మౌలిక వసతులు, సి.సి.టి.వి.కెమెరాలు లభ్యత పై సమీక్షించి అక్టోబర్ 5 లోగా ఏర్పాటు చేయాలని సూచించారు. అవసరమైతే అధికారులతో కలిసి తాను స్వయంగా సంబంధిత సెంటర్లను పరిశీలిస్తానని పేర్కొన్నారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాహుల్‌శర్మ, రెవెన్యూ అదనపుకలెక్టర్ భాస్కర్‌రావు, ఇంటర్మీడియట్ విద్య అధికారి దస్రు నాయక్, జిల్లా విద్యా శాఖ అధికారి బిక్షపతి, తదితరులు పాల్గొన్నారు.